RRR తో ప్రపంచ స్థాయి లో తెలుగు సినిమాని నిలబెట్టిన ఘనత రాజమౌళికి దక్కింది. సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ తెచ్చుకోగా సినిమా దర్శకుడిగా రాజమౌళి పేరు ఒక రేంజ్ లో మారుమ్రోగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మించిన డివివి దానయ్య ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో కనిపించలేదు. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ నిర్మాత బదులుగా బాహుబలి నిర్మాత అక్కడ దర్శనమిచ్చాడు. ఇంతకీ ఆర్.ఆర్.ఆర్ అసలు నిర్మాత దానయ్యేనా కాదా అన్న డౌట్ కూడా వచ్చింది.

అయితే ఆర్.ఆర్.ఆర్ నిర్మాత 100కి 100 శాత దానయ్యే. కానీ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ మాత్రం రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్ మీదే ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే రాజమౌళికి దానయ్య డివివి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నా ఆర్.ఆర్.ఆర్ సినిమాకు అది కుదిరిందని తెలుస్తుంది. అదేంటి అంటే మగధీర సినిమా టైం లోనే దానయ్య డివివి రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాడట. అయితె మర్యాద రామన్న సినిమా చేయాలని దానయ్య అనుకోగా ఆ సినిమా వద్దని అనుకున్నారట.

ఒకవేల అప్పుడు దానయ్య మర్యాద రామన్న సినిమా చేసి ఉంటే rrr సినిమా అతను మిస్ అయ్యే వాడని అన్నారు. మొత్తానికి ఆస్కార్ విన్ అయిన సినిమాను తన బ్యానర్ లో నిర్మించిన క్రెడిట్ దక్కించుకున్నారు దానయ్య డివివి. ముఖ్యంగా సినిమా కోసం దానయ్య పెట్టిన ఖర్చుకు ఓ రేంజ్ లో ప్రాఫిట్స్ వచ్చాయి. డివివి దానయ్య rrr నిర్మాత అని చెప్పుకుంటే చాలు అతని ఖాతాలో ఒక మైల్ స్టోన్ మూవీ ఉన్నట్టే లెక్క. ఇక తన నెక్స్ట్ సినిమా కూడా చరణ్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో రాజమౌళి హాలీవుడ్ టీం ని కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: