
ఈ సినిమాకి సైంధవ్ అనే టైటిల్ ని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మాస్ గ్లింప్స్ తో సినిమాపై చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఇక తాజాగా సైంధవ్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. పవిత్రమైన క్రిస్మస్ పండుగ కానుకగా 22 డిసెంబర్ 2023న సైంధవ్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.ఇంకా అలాగే రిలీజ్ డేట్ తో పాటు వెంకీ మామది ఓ మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక దీంతో వెంకటేష్ ని మరోసారి పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూడొచ్చని అభిమానులు ఇంకా ప్రేక్షకులు సైంధవ్ సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.పోస్టర్లో వెంకటేష్ మాస్ లుక్ చూస్తుంటే ఖచ్చితంగా కమల్ హాసన్ విక్రమ్ లా పెద్ద హిట్ అయ్యేట్టు కనిపిస్తుంది. విక్రమ్ రేంజ్ కి తగ్గకుండా ఈ సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.