గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ అప్పటినుండి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.  ఈ క్రమంలోనే తన 30వ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. కోస్టల్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గారు పొందుతున్న దేవర సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని గత నెలలో ప్రారంభించారు చిత్ర బృందం.

 అనంతరం వాటికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూల్ లను కూడా పూర్తి చేశారు. వచ్చేవారం నుండి ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ షూటింగ్ని ప్రారంభిస్తారట చిత్ర బృందం. ఇక ఆ షూటింగ్ కు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది .అయితే ఈ షూటింగ్లో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. అయితే ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాన్వికపూర్ ఈ సినిమాలో ఓ అండర్ కవర్ ఆఫీసర్గా నటిస్తుందని అంటున్నారు.

కోస్టల్ ఏరియాలో ఒక డాన్ అయిన ఎన్టీఆర్ పై నిఘా పెట్టేందుకు తన పై అధికారులు ఆమెను అక్కడికి పంపిస్తారట. అందుకే ఆమె జాలరి గా ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో కనిపిస్తుంది. కానీ సినిమాలో ఆమెది రియల్ క్యారెక్టర్ కాదట.ఆమె క్యారెక్టర్ రివిల్ అయ్యే ట్విస్టర్ ఫ్రీ ఇంటర్వెల్ లో వస్తుందని అంటున్నారు. థియేటర్లో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వార్త విన్నందరూ ఎన్టీఆర్ ని అంతలా మోసం చేస్తావా జాన్వి అంటూ కామెంట్స్ ని పెడుతున్నారు.ఇక ఈ సినిమాని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు .కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: