సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక సినిమాలే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి కూడా అంతే సమయాన్ని తన ఫ్యామిలీతో కూడా కేటాయిస్తాడు మహేష్ బాబు.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ టైమ్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోడు. ఇక తన ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు కోట్లు తెచ్చే సినిమా కంటే ఇతను ఫ్యామిలీతో సమయాన్ని గడపడంతో వచ్చే ఆనందమే తనకి కోట్ల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అంటూ చాలా సందర్భాల్లో వెల్లడించాడు మహేష్ బాబు.

అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి తన ఫ్యామిలీతో తరచుగా వెకేషన్కు వెళుతూ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు.  అయితే మహేష్ బాబు లాగే తన సమయాన్ని సినిమాలకే కాకుండా ఫ్యామిలీకి కూడా ఇచ్చే వారిలో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఉందని అంటున్నారు. ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి.సాయి పల్లవి కూడా అచ్చం మహేష్ బాబు లాగే తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తుంది. మహేష్ బాబు లాగే సాయి పల్లవి కూడా తన కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందట. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంది.

షూటింగ్ సమయంలో ప్యాకప్ చెప్పిన తర్వాత ఆమె ఒక నటి హీరోయిన్ అన్న విషయాన్ని మరిచిపోయి ఫ్యామిలీతో ఆనందంగా ఉంటుంది సాయి పల్లవి.ఒక పనిలో ఆనందాన్ని వెతుక్కునప్పుడు ఆ పని చాలా సంతృప్తిగా ఉంటుంది అలాగని దాన్ని వ్యక్తిగత జీవితంలో గీత తీసుకు రాకూడదు. దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇవ్వాలి .వృత్తిని జీవితాన్ని వేరువేరుగా చూసినప్పుడే మానసికంగా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మానసిక ప్రశాంతత లేకపోయినప్పుడు ఎన్ని కోట్లు ఉన్న దానికి విలువ ఉండదు. అంటూ చెబుతోంది సాయి పల్లవి .ఇదిలా ఉంటే ఇంకా సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది .కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని లోక నాయకుడు కమలహాసన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పనిలో బిజీగా ఉంది సాయి పల్లవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: