దేశం గర్వించదగ్గ  దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న రాజాం ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పటివరకు రాజమౌళి చాలా మంది స్టార్లతో సినిమా చేశారు.  రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అంటే  ఇష్టం. ఇక ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పాడు. అంతేకాదు ఎన్టీఆర్కి కూడా రాజమౌళి అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం రాజమౌళి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఎందుకంటే గతంలో రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సింహాద్రి సినిమాతో రాజమౌళికి అవకాశాన్ని ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. దాని అనంతరం ఎన్టీఆర్ కి సినిమాలో లేని సమయంలో రాజమౌళి యమదొంగ సినిమా చేసి జూనియర్ ఎన్టీఆర్కి లైఫ్ని ఇచ్చాడు. అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది ఆ బంధమే ఇప్పటివరకు కొనసాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ చెప్పుకునే సినిమాలు ఐదు. ఇక ఆ సినిమాల్లో నాలుగు సినిమాలు రాజమౌళి కావడం గమనార్హం. అయితే ఎక్కువ సినిమాలలో కలిసి పని చేయడం ఎక్కువ రోజులు ట్రావెల్ చేయడం వల్ల ఇద్దరి మధ్య అన్నదమ్ముల బంధం ఏర్పడింది.

అయితే వీరిద్దరే కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా చేసినా కూడా అది ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రేంజ్ లో ఉంటుంది ఆడడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చాడు రాజమౌళి. అయితే తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో మరొక రిస్క్ చేయడానికి రెడీ అయ్యాడట రాజమౌళి. అయితే ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి గరుడ అనే ఒక సినిమాని తీయాలని ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. కానీ బడ్జెట్ సరిపోక ఇప్పటివరకు ఆ సినిమాని స్టార్ట్ చేయలేదు. అయితే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ మార్కెట్ ఎప్పుడు 1000 కోట్ల రేంజ్ కి వెళ్లిన నేపథ్యంలో ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి. ఇక మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తాడట  ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: