
ఇందులో ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీరు వడ్డీ రూపంలో రాబడి పొందవచ్చు. ఇక మెచ్యూరిటీ తర్వాత ఎలాగో మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ పథకం కింద మీరు రూ .9లక్షలు డిపాజిట్ చేస్తే.. ఒకవేళ జాయింట్ అకౌంట్ తెరిచాలనుకున్న వారు రూ.15 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో గరిష్టంగా రూ.9లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దాని లిమిట్ ను రూ .15 లక్షల వరకు పెంచారు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు.. అయితే ఈ పథకం పైన మీరు 7.4% వడ్డీ పొందవచ్చు. ఇక ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. మీ చేతికి ప్రతి నెల రూ.9,250 వరకు వడ్డీ లభిస్తుంది. ఇలా మీరు ఐదు సంవత్సరాలు పాటు డబ్బును పొంది ఆ తర్వాత మీ డబ్బులు మీరు వెనక్కి పొందవచ్చు. రూ .5లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు , రూ.3000 వరకు వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.