సమంత.. ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. ఆమె నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో పాటు సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఓ బేబీ' కూడా మంచి వసూళ్లను రాబట్టింది. 


అందం, అభిన‌యం రెండు క‌లగ‌ల‌సిన న‌టి స‌మంత‌. ఈ అమ్మ‌డు 2017 అక్టోబ‌ర్‌లో నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన స‌మంత మంచి స‌క్సెస్‌లు సాధించింది. ఇటీవ‌ల ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శ‌ర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మ‌రోవైపు `ఫ్యామిలీమెన్-2` వెబ్‌సిరీస్ లోను న‌టిస్తుంది స‌మంత‌. ఇవి పూర్తైన త‌ర్వాత‌ కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది చూడాలి.


ఇకపోతే కెరియ‌ర్ మంచి ఊపు మీద ఉన్న స‌మ‌యంలో స‌మంత నిర్ణ‌యం స‌రైన‌దేనా అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలా అని త‌ప్ప‌ని కాదు ఎవ‌రి ప‌ర్స‌న‌ల్ అభిప్రాయాలు వాళ్ళ‌కి ఉంటాయి. హీరోయిన్ అయినా ఎవ‌రైనా స‌రే కెరియ‌ర్ అనేది కొంత వ‌ర‌కు ఉన్నా వాళ్ళ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కి కూడా స‌మ‌యం అనేది కేటాయించాలి అనుకుంటారు.  ఐతే ఇదిలా ఉంటే అక్కినేని అమ‌ల‌కు ఎవ‌రో ఒక జ్యోతిష్కుడు అక్కినేని నాగేశ్వ‌రావు స‌మంత‌కి పుడ‌తార‌ని చెప్పాని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ విష‌యం విన్న అమ‌ల ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింద‌ని స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: