సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన అల్లుడు అక్కినేని నాగచైతన్య తో కలిసి నటించిన వెంకీ మామ. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యేసరికి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వెంకీ మామ సినిమా హిట్ టాక్ ను ఈ సినిమా యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈరోజు విక్టరీ వెంకటేష్ కు రెండు ఆనందాలు. ఒకటి వెంకీ మామ సినిమా హిట్ అవటం అయితే... రెండోది ఈ రోజు వెంకీ బర్త్ డే.
సీరియస్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా ఏ పాత్రలో నైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులకి వినోదాన్ని అందించడంలో మహా నేర్పరి విక్టరీ వెంకటేష్. ఇక ఈ రోజు తన పుట్టిన రోజు కానుకగా తాను వెంకీ మామతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకోవడం ఒక హ్యాపీ అయితే.. పైగా నిజ జీవితంలో తన మేనళ్లుడు అయిన నాగ చైతన్యతో వెంకీ మల్టీస్టారర్ చేయడం మరో హ్యాపీ.
ఇక ఈ సినిమాకు తన అన్న సురేష్ బాబు నిర్మాత అవ్వడం కూడా మరో ఆనందదాయకర అంశం. ఇక చైతు - వెంకీతో మల్టీస్టారర్ చేయాలన్న రామానాయుడు కోరిక కూడా ఈ సినిమాతో అందరూ తీర్చారు. ఈ రోజు వెంకటేష్ 59వ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
ఒకవైపు కుర్ర హీరోలని ప్రోత్సహిస్తూ మరో వైపు మంచి సినిమాలు చేస్తున్న వెంకటేష్‌కి టాలీవుడ్ సినీ లోకం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ బాబు, అనీల్ రావిపూడి, కోన వెంకట్, అనీల్ సుంకర, రాశీ ఖన్నా, నితిన్, శ్రీను వైట్ల, బాబీ, రానా ఇలా పలువురు ప్రముఖులు వెంకీకి బర్త్‌డే విషెస్ అందించారు. వెంకీ మరెన్నో హిట్ సినిమాలు తీయాలని వారు శుభాకాంక్షలు చెపుతున్నారు.