సినీ పరిశ్రమలో టాప్ హీరోలకు అభిమానులు ఉంటారు..  అందులో కొంతమందికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు. అయితే వారు చేసే పనులు చూస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం మాత్రమే కాదు... ఇంత సాహసాలు కూడా చేస్తుంటారా అనిపిస్తుంది.  ఆ మద్య పూజా హెగ్డే కోసం ఓ అభిమాని తీవ్రమైన చలిలో ఉదయం పుట ఏకంగా మూడు రోజులు ఎదురు చూశాడు.  ఈ విషయం తెలుసుకున్న పూజా హెగ్డే అతన్ని కలిసి ఇలాంటి పనులు చేయొద్దు అని.. అభిమానులు అంటే తమకు ఎంత గౌరవం అని.. ఒకవేళ వారికి ఏదైనా అయితే తామే బాధపడతామని అని చెప్పి పంపించింది.  కొంత మంది అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని కొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.  

 

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం ఓ అభిమాని చేసి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడా అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. అస్సాంలోని టిన్సుకియాకు చెందిన భూపెన్ లిక్సన్(52) బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు వీరాభిమాని. సైక్లిస్ట్ అయిన భూపెన్ లిక్సన్ ఫిబ్రవరి 8 న తన స్వస్థలం జగూన్ పట్టణం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఫిబ్రవరి 13 న గౌహతి చేరుకున్నాడు.  తాను సైకిల్ తొక్కుతున్న, సల్మాన్ సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ప్రింట్ చేసిన ఓ పోస్టర్ ను సైకిల్ కు పెట్టుకుని తన అభిమానాన్ని చాటాడు.

 

 అస్సాంలోని గౌహతిలో ఈ నెల 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. సల్మాన్ ఖాన్ ఆ ప్రోగ్రాంలో పాల్గొననున్నాడు. ఇది తెలుసుకున్న భూపెన్ తన అభిమాన హీరోని కలిసేందుకు ఐదు రోజుల్లోనే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి.. 13న సాయంత్రం గౌహతికి చేరుకున్నాడు. ఇక భూపేన్ వయసులో ఉన్నపుడు సైకిల్ ఛాంపియన్.  ఆయన పేరుపై ఎన్నో అవార్డులు.. రివార్డులు కూడా ఉన్నాయట. తాజాగా ఈ ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: