లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  అయితే, ఇటీవలే షూటింగ్ జరుగుతుండగా భారీ క్రేన్ విరిగిపడి ముగ్గురు టెక్నిషియన్లు మరణించారు.  టెక్నిషియన్లు మరణించిన వెంటనే కమల్ హాసన్ మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు.  కమల్ ప్రకటించిన విరాళం ఒక్కటే బయటకు వచ్చింది.  

 

దీనిపై శంకర్ గాని, అటు లైకా ప్రొడక్షన్ యూనిట్ గాని ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కమల్ హాసన్ కు కోపం వచ్చింది.  మరణించిన కుటుంబాలకు ఎదో ఒకటి చేయాలని, అప్పటి వరకు షూటింగ్ కు రానని చెప్పేశారు.  కమల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి.  దీంతో కమల్ ను బుజ్జగించేందుకు లైకా యూనిట్ రెడీ అయ్యింది.  కమల్ హాసన్ ను ఉద్దేశిస్తూ ఒక బహిరంగ లేఖను రాసింది.  


మరణించిన  ముగ్గురు టెక్నిషియన్ల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించామని, 2కోట్ల రూపాయల సమయం చేశామని, భీమా సౌకర్యాలను అందించామని, వారి కుటుంబాలను ఆడుకుంటున్నామని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని, చేసిన పనిని చెప్పుకోవడం ఇష్టం లేదని, ఈ సమయంలో సహాయం చేసిన దాని గురించి చెప్పుకోవలసిన అవసరం లేదని మీరు కోరినట్టుగానే అన్ని జరిగిపోయాయని, ఇక షూటింగ్ తిరిగి ప్రారంభిస్తే బాగుంటుందని కోరుకుంటూ లైకా లేఖ రాసింది.  


చేసిన సహాయాన్ని పైకి చెప్పడం ఇష్టం లేదు అంటే అర్ధం ఏంటి ? కమల్ హాసన్ ను ఉద్దేశిస్తూ చేసిందేనా ఈ మాట అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.  ఎందుకంటే మాములుగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటె వారికీ సహాయం చేయాలి.  కొంతమంది అందరికి తెలిసేలా సహాయం చేస్తారు.  కొందరు సహాయం చేస్తున్నట్టుగా మరొక చేయికి కూడా తెలియకుండా చేస్తుంటారు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ అలానే చేసింది.  ఎవరికీ తెలియకుండా సహాయం చేసింది.  అందుకే ఈ ఇబ్బందులు వచ్చి ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: