టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. తండ్రి వారసత్వం ఉన్నా సరే నటుడుగా మహేష్ బాబు తన సినీ ప్రయాణంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి వారసత్వం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అంత తక్కువ కాలంలో అంత మంచి గుర్తింపు తెచ్చుకోలేదు అనేది వాస్తవం. ఇక ఇది పక్కన పెడితే ఈ మధ్య వరుస విజయాలతో మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. 

 

అతను గత రెండు మూడేళ్ళ కాలంలో నటించిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయాలే. మహర్షి, భరత్ అను నేను సినిమాలు మహేష్ ఫాలోయింగ్ ని మరింతగా పెంచాయి. ఇక ఈ మధ్య వచ్చిన సరిలేరు నీకవ్వరు సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని మహేష్ కి అందించింది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మహేష్ ఆలోచనా విధానం పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. కమర్షియల్ సినిమాల మీద మహేష్ పెడుతున్న దృష్టి తో అతని కెరీర్ ప్రమాదంలో పడుతుంది. బాలీవుడ్ సినిమాల తరహాలో తన సినిమాలు వందల కోట్లు, వసూలు చెయ్యాలి అనే పట్టుదల మహేష్ లో కనపడుతుంది.

 

దీనితో నిర్మాతలు దర్శకులు ఇప్పుడు మహేష్ బాబుకి దూరంగా ఉంటున్నారు. ఆయనతో సినిమా చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు దర్శకులకు కథల విషయంలో చేస్తున్న సూచనలు ఇబ్బంది పెడుతున్నాయి. కథ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ సూచనల రూపంలో కాస్త ఘాటు సలహాలు ఇస్తున్నాడు. దానికి తోడు మహేష్ సినిమాల నమ్రత పెత్తనం ఎక్కువైంది అనే టాక్ వినపడుతుంది. ఆమె చెప్పినట్టే నిర్మాతలు ఉండాలి అనే భావన ఇబ్బంది పెడుతుంది. అనవసరంగా సినిమా కథల విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: