తెలుగు ఇండిస్ట్రీకి ఎంద‌రో క‌మెడియ‌న్లు ప‌ర‌చ‌డం అయ్యారు. వాళ్ల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు. అందులో ముఖ్యంగా బాబు మోహన్, కోట శ్రీనివాసరావు ముందు వ‌ర‌స‌లో ఉంటారు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. తెలుగు సినిమా రంగంలో ఈ ఇద్దరూ కమెడియన్లు గా కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించారు. వాస్త‌వానికి కోటా శ్రీ‌నివాస‌రావు మన తెలుగు ఇండస్ట్రీ నుంచే తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో నటించాడు. ఇప్పటికే దాదాపు 500 పైగా చేశాడు కూడా కోట శ్రీనివాసరావు. అయితే వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆయనకు అవకాశాలు రావడం లేదు.

 

సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. అయితే 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. ముఖ్యగా అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర ఈయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెచ్చింది. అప్ప‌టి నుంచీ ఎన్నో పాత్ర‌లు పోషించారీయ‌న‌.

 

బాబు మోహ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు.  ముఖ్యంగా మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా ఈయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు. మ‌రోవైపు బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఈయ‌న రాజ‌కీయాల్లోనూ బాగానే రాణించాడు.

 

ఇక‌ కమర్షియల్ గా అయినా.. కామెడీ విలన్లుగా అయినా... సీరియస్ విలన్లుగా అయినా కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ తెర మీద కనిపిస్తే తెలుగు ప్రేక్షకులకు వచ్చే కిక్కే వేరు. ఇలా సినిమా రంగంలోనూ రాజకీయరంగంలోనూ బాగానే రాణించారు.  అయితే వీరిద్ద‌రి జీవితంలో ఒక తీరని విషాదం చోటుచేసుకుంది. బాబు మోహన్ కుమారుడు మ‌రియు కోట శ్రీనివాసరావు కుమారుడు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరిద్ద‌రి జీవితంలో ఆ ఘ‌ట‌న‌లు తీర‌ని విషాదంగా మిగిలిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: