కరోనా వేలమందిని బలితీసుకొంటోంది. ఇప్పటికే దీని బారీన పడి 2,9000మంది ప్రాణాలు కోల్పోగా వీళ్లలో డాక్టర్లు, వైద్యసిబ్బంది, పక్క బెడ్ పేషెంట్లూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న కొత్త వైరస్ మనుషులకు ఎలా సోకుతోంది? ఎందుకు కొంతమందినే బలితీసుకొంటోంది? వందమందికి కరోనా సోకితే సగటున ఇద్దరు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు. ఇద్దరు ఎలా చనిపోతున్నారు? వైరస్ ప్రభావమా? లేక వ్యాధులను తట్టుకొనే శక్తి  లేకపోవడమా?

 

IHG

 

విషయానికి వస్తే కరోనావైరస్ మరణాల రేటు సాధారణ ఫ్లూ వల్ల కలిగే మరణాల రేటు కంటే అధికంగా ఉంది. చైనాలో వైరస్ సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోయినట్లు దేశానికి చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. చైనాలో వైరస్ బారిన పడి చనిపోయినవారిలో 80 శాతం మంది 60 ఏళ్లు దాటినవారే. అంటే ఇది వృద్ధులకు చాలా సులువుగా సోకుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముసలివాళ్ళు దగ్గుతున్నట్లు కనపడితే వారి నుండి దూరంగా ఉండడం ఉత్తమం.

 

వైరస్ సోకినవారిలో 80 శాతం మంది ఎలాంటి ప్రత్యేక చికిత్స లేకుండానే దీన్నుంచి బయటపడుతున్నారు. వైరస్ సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక దీని నుండి తప్పించుకున్న వారంతా శుభ్రత ను పాటించే వ్యక్తులుగా గుర్తించబడగా.. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల దీనిని నివారించవచ్చు. అలాగే బయటకు వెళ్లిన ప్రతీసారి మాస్క్ ధరించడం మంచిది.ఇక మీరు తిరిగే ఏరియాలో కరోనా కేసు నమోదయి ఉంటే అది తప్పనిసరి.

 

IHG

 

సాధారణంగా జంతువుల్లో కనిపించే వైరస్ జంతువుల్లోనే మొదలై వాటి నుంచి మనుషులకు వస్తుంది. మనుషుల నుంచి మనుషులకూ సోకుతుంది. ప్రస్తుతం ఇది ఇరాన్‌లో శరవేగంతో వ్యాపిస్తోంది. ఉత్తర ఇటలీలోనూ ప్రభావం చూపడంతో అక్కడ ఊళ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దక్షిణ కొరియాలోనూ పరిస్థితి భయానకంగా ఉంది. ఇక రోజే మన దేశంలో ముగ్గురికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. అందులో ఒకరు మన హైదరాబాదు అతనే కావడం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: