ఇప్పటి వరకు వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటి అండీ... ఏ బాబు కాఫీ ఏమైనా తాగుతావా...? అంటూ జులాయి సినిమాలో ప్రగతి ఆంటీ మాట్లాడిన మాటలు ఆ సినిమాలో హైలెట్. టాలీవుడ్ లో మోడరన్ భార్యగా మోడరన్ అమ్మగా ఆమె నటన ప్రేక్షకులను మైమరిపించింది. ముఖ్యంగా హీరోయిన్ కి తల్లిగా ఆమె చేసిన ఎన్నో పాత్రలు ఆకట్టుకున్నాయి. హీరోకి తల్లిగా చేసిన పాత్రల్లో వచ్చిన గుర్తింపు కంటే హీరోయిన్ కి తల్లిగా వచ్చిన గుర్తింపే ఎక్కువ. టాలీవుడ్ లో చాలా మంది అమ్మ పాత్రలు చేసినా ఆమె చేసిన అమ్మ పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 

 

మహేష్ బాబు, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలా మంది సినిమాల్లో ఆమె హీరోయిన్ కి అమ్మగా నటించారు. ఇక యువ హీరోలకు కూడా ఆమె అమ్మగా నటించారు. ఎప్పుడో వచ్చిన గంగోత్రి నుంచి నిన్నా మొన్న వచ్చిన సినిమాల వరకు ఆమె చేసిన అమ్మ పాత్రలు అలా నిలిచిపోయాయి. ఆమె స్టైల్ గా మాట్లాడే మాటలతో పాటుగా ఆమె నటనలో హావ భావాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. దూకుడు సినిమాలో ఆమె సమంతా కు తల్లిగా నటించారు ఒక కూతురి బాధను అర్ధం చేసుకునే తల్లి గా ఆమె నటన ఆకట్టుకుంది. 

 

ఇక సీరియస్ సన్నివేశాల్లో కూడా ఆమె నటనతో మెప్పించారు అనే చెప్పాలి. ముఖ్యంగా భావోద్వేగాలను ఆమె పండించే తీరు ఆకట్టుకుంటుంది. హీరోకి అత్తగారిగా కూడా ఆమె కనిపించారు. గంగోత్రి సినిమాలో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి అప్పట్లో. ఆమెకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది కనుమరుగు అయిపోయినా సరే ఆమె మాత్రం అలాగే సినిమాలు చేస్తున్నారు. దర్శకులు కూడా ఆమెకు ప్రత్యామ్నాయ౦ చూడలేకపోతున్నారు అనేది వాస్తవం. ప్రస్తుత౦ ఆమె మూడు సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: