పవన్ కల్యాణ్ సినిమా రాబోతుందంటే హడావిడి ఏస్థాయిలో ఉంటుందో నిన్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కి చూపించేశారు పవన్ ఫ్యాన్స్ కమ్ మెగా ఫ్యాన్స్. రెండేళ్లుగా పవన్ సినిమా కోసం వేచి చూసిన వారి ఎదురుచూపులకు పవన్ ఇచ్చిన స్టైలిష్ లుక్ వారి దాహాన్ని మాత్రమే తీర్చింది. పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఏకంగా దేశంలోనే టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ కు గానీ వారి ఆకలి తీరేలా లేదు.

 

 

కేవలం ఫస్ట్ లుక్ కే బ్యానర్లు, పాలాభిషేకాలు, దావత్ లు, కేక్ కటింగులు దేశంలో మరే హీరోకు కూడా వారి అభిమానులు చేసి ఉండరనేది నిజం. నిజానికి పవన్ పింక్ రీమేక్ చేస్తున్నాడంటే ఫ్యాన్స్ అంతా కంగారుపడ్డారు. అసలే రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో పవన్ నుంచి వారు గబ్బర్ సింగ్ లాంటి మాస్ మసాలా యాక్షన్ సినిమా కోసం ఎదురుచూడడం సహజం. కానీ ఎవరూ ఊహించని లాయర్ సబ్జెక్టును ఎంచుకున్నాడు పవన్. కోర్టులో వాదించడం తప్ప ఈ సినిమాలో పవన్ స్టైల్, యాక్షన్, పాటలు మిస్సవుతామని కొందరిలో ఆందోళన ఉండేది. మరికొందరు మాత్రం పవన్ సినిమాలు చేస్తే చాలు అనుకున్నవారూ లేకపోలేదు.

 

 

కానీ.. నిన్న ఫస్ట్ లుక్ విడదలయ్యాక పరిస్థితి చూస్తే పవన్ ను సినిమాల్లో చూస్తున్నాం అంతే.. అనే ఆలోచన తప్ప వారిలో మరేమీ కనిపించలేదన్నది నిజం. హిందీ, తమిళ సినిమాలకు విరుద్ధంగా ఫస్ట్ లుక్ లోనే ఇంత వేరియషన్ చూపించిన దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాలో మరిన్ని మార్పులు చేశాడట. ఫ్యాన్స్ కోసం కావాల్సిన అంశాలను, పవన్ స్టైల్ ను మిక్స్ చేశాడట. ఇక మిగిలిందల్లా మే నెల రావడమే. ఫ్యాన్స్ అప్పుడెంత సందడి చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: