మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మాస్ అభిమానుల ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ అభిమానులు కావడంతో చరణ్ సినిమాలో చాలా రికార్డ్స్ వారివల్లే బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేశాడు అని చెప్పవచ్చు. చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎక్కడా కూడా తండ్రి పేరుకి మచ్చ రాకుండా మెగా అభిమానులను అలరిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో కెరియర్ మొత్తం డార్క్ పిరియడ్ లో ఉన్న సమయంలో ధ్రువ సినిమా తో ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 50 కోట్లు కొల్లగొట్టి అందరికీ షాకిచ్చాడు చరణ్.

 

భారీ అంచనాల మధ్య విడుదలైన ధ్రువ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్లు అదరగొట్టింది. ఇదిలా ఉండగా చరణ్ కెరియర్లోనే భయంకరమైన అట్టర్ ఫ్లాప్ సినిమా ‘వినయ విధేయ రామ’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన భయంకరమైన అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ రెండు సినిమాల సిల్వర్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో...స్మాల్ స్క్రీన్ లో కూడా అలానే ఉంది.

 

గతవారం 'ధ్రువ' సినిమా జెమినీ సినిమాలో అలాగే 'వినయ విధేయ రామ' మాస్టార్ సినిమాలో టెలికాస్ట్ చేయగా ధ్రువా సినిమాకు 5.9 టిఆర్పి రేటింగ్ రాగా...వినయ విధేయ రామ సినిమాకి 7.53 టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే రాంచరణ్ హిట్ సినిమా కంటే ఫ్లాప్ సినిమా టెలివిజన్ రేటింగ్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా గతంలో రెండుసార్లు 'వినయ విధేయ రామ' సినిమాని టెలికాస్ట్ చేయగా 8.00 రేటింగ్ సాధించడం విశేషం. మొత్తంమీద ఫ్లాప్ సినిమాతో సరికొత్త రికార్డు టెలివిజన్ రంగంలో క్రియేట్ చేశాడు రామ్ చరణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: