కరోనా ప్రపంచాన్నంత స్థంబించి పోయేలా చేసింది. ఎప్పుడు బిజీ లైఫ్ లో గడిపే చాలా మందికి ఈ కరోనా కారణంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. అంతేకాదు ఈ మధ్యే సోషల్ మీడియాలో అడుగు పెట్టిన పలువురు సెలబ్రిటీలకు అభిమానులతో మరింతగా ఇంటరాక్ట్ అయ్యేందుకు సమయం దొరికింది. ఈ లిస్ట్ బాలీవుడ్ హాట్ బ్యూటీ బెబో కరీనా కపూర్ కూడా ఉండటం విశేషం.
ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. అయితే ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటుంది కరీనా. తాజాగా ఓ హాట్ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసింది ఈ బ్యూటీ. గతంలో తను ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఓ వెకేషన్ ఫోటోను ఇన్స్టా పేజ్లో షేర్ చేసింది. ఈ ఫోటోలో కరీనాతో పాటు భర్త సైఫ్, కొడుకు తైమూర్లు కూడా ఉన్నారు.
అయితే ఈ ఫోటో రెడ్ హాట్ బికినీ ఉన్న కరీనాను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇంత హట్ ఫోటో ఎప్పుడూ షేర్ చేయకపోవటంతో అభిమానులు ఈ ఫోటోతో పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోతో గ్లామర్ షోకు కరీనా గేట్లు ఎత్తిందని ఆనందపడిపోతున్నారు. మరి ముందు ముందుకు కూడా కరీనా ఈ హాట్ షో కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.