టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ అనేది చాలా కీలకంగా మారింది. ప్రతీ హీరో కూడా మార్కెట్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తున్నాడు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతున్నారు అందరూ కూడా. టాలీవుడ్ హీరోలు మార్కెట్ కి అలవాటు పడ్డారు అని భావించిన దర్శకులు కథలను కూడా అదే విధంగా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలు ఎక్కువగా కమర్షియల్ కోణం లోనే ఆలోచిస్తున్నారు. నిర్మాతలు కూడా అలాగే ఉండటం తో కమర్షియల్ సినిమాల సంఖ్య పెరిగింది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు చిన్న చిన్న హీరోలు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన భార్య సమంతా సలహాలను ఇందుకోసం తీసుకుంటున్నాడు అనే టాక్ వినపడుతుంది. సమంతా కథలను వింటుందని నాగ చైతన్యకు సలహాలు ఎక్కువగా ఇస్తుంది అని సమాచారం. దర్శకుల ఎంపిక విషయంలో కూడా ఆమె సలహాలను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రెమ్యునరేషన్ కూడా ఆమె నిర్ణయం తీసుకుని చెప్తుందని అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆమె సినిమాల ను పూర్తిగా వదిలేసే ఆలోచనలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం చైతు వ్యవహారాలను ఎక్కువగా చూస్తుందని ఇక ఫ్యామిలీ కి సమయం కేటాయించాలి అనే ఆలోచనలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం చైతన్య రెండు మూడు సినిమాల్లో చేస్తున్నాడు. డేట్స్ కూడా ఆమె కేటాయిస్తూ చైతుకి అన్ని విధాలుగా అండగా ఉంటుంది అంటున్నారు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. అగ్ర దర్శకులతో కూడా ఆమె సంప్రదింపులు జరుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: