మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ ఇప్పుడు మంచి జోష్ లో నడుస్తుందని చెప్పొచ్చు. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ కంచెతో పర్వాలేదు అనిపించుకోగా.. మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది మాత్రం ఫిదా సినిమాతోనే.. ఆ తర్వాత వెంటనే తొలిప్రేమ హిట్ అతనికి స్టార్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక గడ్డలకొండ గణేష్ తో వరుణ్ తేజ్ తనలోని నట విశ్వరూపం చూపించాడు. కరెక్ట్ కంటెంట్ పడాలే కానీ వరుణ్ తేజ్ కూడా తన సత్తా చాటుతాడని గడ్డలకొండ గణేష్ సినిమాతో అర్ధమైంది. 

 

ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలిసిందే. సినిమా కోసం స్పెషల్ గా బాక్సింగ్ కోచ్ ను పెట్టుకున్నాడు ఈ మెగా హీరో. క్వారెంటైన్ టైం లో సరదాగా మెగా ఫ్యాన్స్ తో చాట్ చేసిన వరుణ్ తేజ్ ను అభిమానులు రకరకాల ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే.. కంటెంట్ ఉన్న సినిమాను చేయడం ఇష్టమా.. కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమా అని ఒక అభిమాని అడిగాడు. దానికి తెలివిగా కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా చేయడం ఇష్టమని చెప్పాడు వరుణ్ తేజ్. 

 

కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలతో హిట్టు కొట్టడమే తన టార్గెట్ అని మరోసారి అభిమానులకు చెప్పాడు ఈ మెగా ప్రిన్స్. స్క్రీన్ నేమ్ మెగా ప్రిన్స్ అని పెట్టిన దగ్గర నుండి వరుణ్ తేజ్ లో కొత్తరకం జోష్ కనబడుతుంది. సాయి తేజ్ కు సుప్రీమ్ హీరో అనే స్క్రీన్ నేమ్ పెట్టిన హరీష్ శంకరే వరుణ్ తేజ్ కు మెగా ప్రిన్స్ అని ఫిక్స్ చేశాడు. అంతకుముందే వరుణ్ తేజ్ ను మీడియాలో మెగా ప్రిన్స్ అని పిలిచేవారు.. దాన్నే స్క్రీన్ నేమ్ గా ఫిక్స్ చేసి హరీష్ శంకర్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: