పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ కొన్ని కోట్ల మందికి పూనకాలు తెప్పిస్తాయి. ఆయన అలా కన్నెత్తి చూస్తే చాలు సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. పవన్ చూపు ఆయన విసిరే పవర్ ఫుల్ పంచ్ కి తట్టుకోవడం చాలా కష్టం. అది ఆయన సినిమా రిలీజైతే ఎవరికైనా అర్థమవుతుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి లేని క్రేజ్ ని సాధించారు. తొలిప్రేమ ఒక్క సినిమా సృష్ఠించిన రికార్డ్స్ ఎన్నేళ్ళైనా చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు. అప్పటి నుంచే ఆయన లెక్క మారిపోయింది. 

 

IHG

బద్రి, ఖుషీ, గబ్బర్ సింగ్ ..లాంటి సినిమాలు చూసే ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు గాని కొంతమంది దర్శకులు గాని అదే తరహా కథలలో నటించడానికి, తెరకెక్కించడానికి ఆరాటపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ రేంజ్ ని మాత్రం ఎవరు బీట్ చేయలేకపోయారు. ఇక కేవలం రెండేళ్ళు సినిమాలకి దూరంగా ఉంటేనే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకి నిర్వహించే ఆడియో ఫంక్షన్స్ లో గాని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గాని చేసిన రచ్చ హంగామా ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఆయన పేరు పలకకుండా ఒక్క ఈవెంట్ కూడా జరగలేదంటే నమ్మని వాడు మూర్ఖుడు అని అనుకోవాల్సిందే.

 

IHG

అంతగా మెగా ఫ్యామిలీలోనే కాదు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ, సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనే పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ అసాధారణం. అయితే ఇదంతా ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా లో నటించకుండానే సాధించుకున్నారు. అదే ఒక్క పాన్ ఇండియా సినిమా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు ఇంతకముందెన్నడు లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని కమిటయి వరసగా రిలీజ్ అయ్యోలా ప్లాన్ చేసుకున్నారు. 

 

First look of Pawan Kalyan-starrer 'Vakeel Saab' revealed | The ...

సాధారణంగా రీ ఎంట్రీ సినిమా అందులోనూ పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో తను కూడా అలాంటి కథ చేయాలనే అనుకుంటారు. కాని ఒక సామాజిక అంశం తో తయారైన కథలో నటించడానికి ఒప్పుకున్నారంటే పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ పాన్ ఇండియా స్టార్ అనే క్రేజ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: