తెలుగు సినీప‌రిశ్ర‌మ మార్కెట్ గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌డంతో మ‌న చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతూ వ‌స్తున్నాయి. టాలీవుడ్ లో హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు గత కొన్ని సంవత్సరాలుగా బాగా ఉత్సాహం చూపుతున్నారు. ఇప్ప‌టికే చాలా చిత్రాలు హిందీలో రీమేకై సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ‘ఎవడు’, ‘డియర్ కామ్రేడ్’, 'భీష్మ' సినిమాల రైట్స్ ను కొనేశారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగులో రేసెంటుగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఒక సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. అదే మన రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’.

 

IHG

 

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్.. పూరికి మరియు హీరో రామ్ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని హీరోయిన్ ఛార్మీ కౌర్ మరియు పూరి జగన్నాథ్ నిర్మించారు. మరి రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా.. అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక బాలీవుడ్ లో మరో తెలుగు సినిమా కూడా రీమేక్ కానుంది. హీరో నాని నిర్మించిన ‘హిట్’ మూవీ కూడా రీమేక్ కానుందట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ - రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. నిజానికి ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే హిందీలోకి కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాతలు.  మరి ఇక్కడ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్‌ లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. 

 

IHG's 'HIT' film trailer releases, Vishwak Sen delivers a power ...

మరింత సమాచారం తెలుసుకోండి: