రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ లో చేసిన ఐదారు సినిమాలతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ప్లాప్ అందుకున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేశాడు రౌడీ హీరో. 

 

డియర్ కామ్రేడ్ కన్నా ఘోరమైన ఫలితం అందుకుంది విజయ్ దేవరకొండ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న క్రాంతి మాధవ్ సునీల్ తో ఉంగరాల రాంబాబు సినిమాతో డిజాస్టర్ తీశాడు. అయినా సరే విజయ్ కు కథ చెప్పి మెప్పించిన క్రాంతి మాధవ్ సినిమాను మాత్రం ప్రేక్షకులను మెప్పించేలా తీయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందే సినిమా రిజల్ట్ తెలిసిన దేవరకొండ విజయ్ ప్రమోషన్స్ కూడా నామ మాత్రంగానే చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 

ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా సక్సెస్ లు లేని పూరి ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండలో ఫైటర్ ఐదు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ తేడా కొడైతే మాత్రం విజయ్ దేవరకొండ కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్టే అని అంటున్నారు. మరి ఫైటర్ తో అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.                 

మరింత సమాచారం తెలుసుకోండి: