ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రి వంద సినిమాలకు పైగా సంగీతం అందించారు. ఎన్నో సూపర్ హిట్స్ ఆయన ఆల్బమ్ లో ఉన్నాయి, ఐదేళ్ల క్రితం ఆయన చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. చక్రి మరణం తర్వాత తమ్ముడు మోహిత్ తన తల్లితో కలిసి మణికొండలో నివసిస్తున్నారు. మోహిత్ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత కరోనా సమయంలో ఆయనపై ఓ వార్త వైరల్ అయింది. చక్రి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందనే వార్తలు రావడంతో మహిత్ నారాయణ్ దీనిపై స్పందించారు.

 

 

‘ఇటివల నిర్మాత డాక్టర్ అనూహ్య రెడ్డి గారు కరోనాపై ఓ పాటకు ట్యూన్ నాతో చేయిస్తున్నారు. ఆ సమయంలో వారు అందించిన సాయాన్ని వక్రీకరించారు. అంతే కానీ మేము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామనేది అసత్యం. లగ్జరీ లైఫ్ లేకపోయినా తాము బాగున్నాం. ఎవరినీ మేమే యాచించడం లేదు. మా నాన్న గారి పెన్షన్ కూడా వస్తుంది. అన్నయ జయంతి నాడు నేను చేస్తున్న మంచి పనులు, అన్నదానం.. వంటివి నోట్ పంపించినా రావడం లేదు. ఇటువంటి ఫేక్ న్యూస్ మాత్రం వస్తున్నాయి. ఇకపై ఇటువంటి గాసిప్ వార్తలు రాసి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎంత దూరమైనా వెళ్తాను. వీలైతే వర్క్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి’ అని ఓ వీడియో రిలీజ్ చేశారు.

 

 

ఇటివలే తాను స్వరపరచిన ‘పరారి’ సినిమా పాటలు కూడా విడుదలయ్యాయని కూడా మహిత్ తెలిపాడు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నానని కూడా అంటున్నాడు. వర్క్స్ లేవన్న మాట నిజమే అని వీలైతే ఎంకరేజ్ చేయాలి కానీ ఓ ఫ్యామిలీని ఇలా తక్కువ చేసి చూపించకూడదని అంటున్నాడు మహిత్. ఈ వార్తలపై వచ్చినవన్నీ గాసిప్స్ అని మహిత్ వీడియోతో అర్ధమైంది. మహిత్ ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే.

మరింత సమాచారం తెలుసుకోండి: