మహానటి తర్వాత తెలుగులో వరుసగా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది.అయితే మన అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ కోసం అందరు వేచి చూస్తున్నారు. బహుశా  హీరోయిన్ గా శ్రీదేవికి ఉన్న ట్రాక్ రికార్డ్ మరే నటికి ఉండదేమో. ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలోను  శ్రీదేవి విజయడంకా మోగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దక్షణాది వారు రాణించడం కష్టమైన బాలీవుడ్ లో సైతం శ్రీదేవి విజయ జండా ఎగరవేసింది.


అలాగే తెలుగు,తమిళ , హిందీ భాషల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎందరో అగ్రశ్రేణీ నటుల సరసన నటించిన శ్రీదేవి బయోపిక్ ఎవరు తీస్తారనే దానిపై జోరుగా అప్పట్లో  చర్చ  జరిగిన సంగతి తెలిసిందే . 16ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీలోకి వచ్చే అంచెలంచెలుగా ఎదిగిన శ్రీదేవి జీవిత చరిత్ర అంటే నిజాంగా అద్భుతం అని చెప్పాలి. శ్రీదేవి మరణం అటు తెలుగు ప్రేక్షకులకే కాదు బాలివుడ్, కోలీవుడ్ అభిమానులు కూడా జీర్ణించుకోలేని వార్త. తమ అభిమాన తార లేదన్న విషయం తెలిసి ఎందరో అభిమానులు తల్లడిల్లిపోయారు. వెండితెరపై మెరిసిన శ్రీదేవిని మళ్ళీ వెండితెరమీద చూడాలని భావిస్తున్నారు.అయితే  శ్రీదేవి బయోపిక్ లో శ్రీదేవి రోల్ వేసే హీరోయిన్ ఎవరు అయితే బాగుంటుంది అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది..


అయితే శ్రీదేవి రోల్ ని ఆమె కూతురు జాన్వీతో చేయిస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయం. శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్. శ్రీదేవి పోలికలు జాన్వీ కపూర్ లో ఉంటాయి. అందులోను తల్లి గూర్చి కూతురుకి బాగా తెలుస్తుంది. శ్రీదేవిని దగ్గర నుంచి చూసింది జాన్వీ. అందుకే శ్రీదేవి బయోపిక్ లో జాన్వీ నటిస్తే బాగుంటుంది అని అటు సినీవర్గాలు, ఇటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. తాము ఎంతగానో అభిమానించే హీరోయిన్ జీవిత చరిత్రను తెర మీద చూడాలని ఎందరో ఆశ పడుతున్నారు.. అప్పట్లో శ్రీదేవి బయోపిక్ తీసున్నారని, శ్రీదేవి భర్త బోనికపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.. కానీ ఇప్పటికి ఇంకా ఆచరణలోకి రాలేదు. అతిలోక సుందరి అయిన శ్రీదేవి బయోపిక్ కోసం ఇంకా ఎంతకాలం వేచి చూడాలో  మరి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: