అలనాటి స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కారణజన్ముడిగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన  నందమూరి తారక రామారావు  బసవతారకం ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి భర్తను ఆరాధ్యదైవంగా పూజించిన బసవతారకం ఏడుగురు అబ్బాయిలకి.. నలుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఎన్టీఆర్ అప్పట్లో స్టార్ హీరోగా కొనసాగుతుండడంతో... ఎక్కువగా బయటి ఉండేవారు.. కుటుంబంతో గడిపేందుకు ఆయనకు అంతగా సమయం దొరికేది కాదు. 

 

 దీంతో ఎన్టీఆర్ సతీమణి అయిన బసవతారకం కి 11 మంది పిల్లలను పెంచి పెద్ద చేసి వారి ఆలనాపాలనా చూసుకోవడమే సరిపోయింది. కనీసం తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకునే సమయం కూడా బసవతారకానికి లేకుండాపోయింది. పిల్లలు సంతోషంగా ఉంటే చాలు తల్లికి ఇంకేం కావాలి అంతకంటే తల్లికి ఇంకేం ఆనందముంది... అన్న మాటకి అసలైన నిదర్శనం బసవతారకం. పిల్లల కోసం సర్వస్వాన్ని ధారపోసిన బసవతారకం... కనీసం తన ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా 11 మంది పిల్లల ఆలనాపాలనా చూస్తూ... పూర్తిస్థాయిలో తల్లి ప్రేమను పంచుతూ పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది. 

 

 

 ఇలా పిల్లలు ఆనందంగా ఉంటే చాలు ఆరోగ్యం గురించి నాకెందుకు అని ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉన్న బసవతారకం ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది. అయితే ఓవైపు క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతూనే మరోవైపు పిల్లల బాగోగులు చూసుకుంటూ... దగ్గరుండి ఆలనా పాలనా చూసింది . ఇక బసవతారకం కి పుట్టిన పిల్లలు తమ తల్లిని అమితంగా ఆరాధించే వారు.  అయితే ఎన్టీఆర్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో బసవతారకం కన్నుమూశారు. 

 

 

 ఇది ఆ 11 మంది పిల్లలకు మరువలేని ఒక విషాద ఘటన అనే చెప్పాలి. పిల్లలు భర్తే లోకంగా బతికిన బసవతారకం అమ్మతనానికి నిలువెత్తు రూపంగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే తల్లి చనిపోయిన వార్త ను జీర్ణించుకోలేకపోతున్న 11 మంది  తల్లి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇక బాలకృష్ణ అయితే తన తల్లి కి బాధ పడిన విదంగా ఇంకే తల్లికి దుస్థితి రావద్దు అని భావించి తన తల్లి పేరుతో నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించి.. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. బసవతారకం హాస్పిటల్ లో ప్రతిరోజు బసవతారకం విగ్రహానికి పూజలు జరుగుతూ ఉంటాయి. తన తల్లి పేరు మీద ఎంతో మంది నిరుపేదలకు క్యాన్సర్ మహమ్మారి నుంచి బయట పడేలా చికిత్స అందిస్తూ తన తల్లి మీద తన ప్రేమను చాటుకున్నారు  బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: