పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు చెప్పినా, స్క్రీన్ పై ఆయన బొమ్మ చూసినా.. పవన్ పేరు వినిపించినా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. అంతటి భారీ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ అనే పేరు ఓ మ్యానియా. పదేళ్లు ఫ్లాపులొచ్చినా.. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా ఒకటే క్రేజ్. ఇంతటి మ్యానియా ఉన్న పవన్ కల్యాణ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మోగిపోతోంది. కారణం.. తన స్టైల్ తో హీరోయిజానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిపిన ‘గబ్బర్ సింగ్’.

IHG

 

సినిమా విడుదలై నేటితో 8ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘8yearsofgabbarsinghhysteria’ అనే హ్యాష్ ట్యాగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం 4గంటల వ్యవధిలో 5మిలియన్ల ట్వీట్లు సాధించి సరికొత్త రికార్డుల కోసం పరిగెడుతోంది. 2012 మే11న విడుదలైన ఈ సినిమాలో పవన్ స్టైల్, డైలాగ్స్, పాటలకు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. విడుదలైన ప్రతిచోటా సంచలనమే. ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని టీజర్లో డైలాగ్ పడినప్పటి నుంచి పెరిగిపోయిన క్రేజ్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండడంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

IHG

 

నేను ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా, అనే డైలాగులు పేలిపోయాయి. హరీశ్ శంకర్ మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్ తో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా మారిపోయాడు. సినిమాలో పవన్ గన్ స్టైల్ కు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. పదేళ్లు ఫ్లాప్స్ తర్వాత పడిన అసలైన పవన్ కల్యాణ్ సినిమాగా నిలిచిపోయింది. ఫ్యాన్స్ పండగ చేసుకున్న ఈ సినిమా 65 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ తో బండ్ల గణేశ్ కు

రెండో సినిమా ఇది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: