అల్లు అర్జున్ మొదటి సారిగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. దానికోసం సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ శేషాచలం అడవుల్లోనే జరగనుందట. అయితే కొన్ని ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం ఫారెన్ వెళ్లాలని అనుకున్నారు.

 

కానీ కరోనా కారణంగా ఇతర దేశాల వారు ఇక్కడికి రావడం గానీ, ఇక్కడి వారు అక్కడికి వెళ్లడం గానీ లేనందున పూర్తిగా ఇండియాలోనే షూట్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాదు పూర్తి ఇండియన్ టెక్నిషియన్స్ తో ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇతర దేశాల సాంకేతిక నిపుణులపై ఆధారపడి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేని కారణంగా ఇక్కడి వారితో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

 

సాధారణంగా సుకుమార్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పనిచేస్తాడు. కానీ పుష్ప సినిమాని సుకుమార్ వేరే ఛాయాగ్రాహకుడిని తీసుకునే పనిలో ఉన్నాడట. హీరో అల్లు అర్జున్ ఛాయిస్ మేరకు నాని గ్యాంగ్ లీడర్ సినిమాకి పనిచేసిన మిరోస్లా క్యూబా బ్రిజోక్ ని తీసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ కెమెరామెన్ ఫారెన్ నుండి రావాలి. కరోనా వల్ల ఇప్పట్లో విదేశీ ప్రయాణాలకి అనుమతి వచ్చే అవకాశం లేదు.

 

మరి ఇలాంటి టైమ్ లో పుష్ప టీమ్ ఈ సినిమాటోగ్రాఫర్ కోసం ఎందుకు వెయిట్ చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదు. అయితే అన్నీ కుదిరితే గ్యాంగ్ లీడర్ దర్శకుడితో సినిమా కానిచ్చేస్తారు. లేదంటే ఇక్కడి కెమెరామెన్ తోనే సినిమా మొదలెడతారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: