టాలీవుడ్ లో కొందరు హీరోల సినిమాలకు ముందు నుంచి కూడా ప్రత్యేకంగా ఒక ఆదరణ అనేది ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే వాళ్ళ సినిమాల మీద ఎన్నో అంచనాలు ఉంటూ ఉంటాయి అభిమానులకు. ఆ అంచనాలను అందుకోలేక చాలా మంది హీరోలు ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు కూడా పడ్డారు. ఆ విధంగా ఇబ్బంది పడిన వారిలో ప్రధానంగా చెప్పుకునే హీరో పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు అన్నీ కూడా చాలా అంచనాలతో వచ్చాయి ముందు నుంచి కూడా. అయితే ఆయన మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. 

 

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి చాలా చెప్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇక ఆయన హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ 2 సినిమా గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ తో వచ్చిన ఆ సినిమా అయితే ప్రేక్షకులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. ఆ సినిమా ఇక నుంచి బాగుంటుంది ఇక నుంచి బాగుంటుంది అని సినిమా చూసిన ప్రతీ నిమిషం కూడా ప్రేక్షకులు అనుకుంటూ నే ఉన్నారు. వారి అంచనాలను మాత్రం ఆ సినిమా అందుకోలేదు అనేది వాస్తవం. 

 

సినిమా కోసం చాలా ఆశగా ఎదురు చూసారు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమా మీద ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు అని అంటారు టాలీవుడ్ జనం. కాని ఆ సినిమా మాత్రం ఆయనను కూడా బాగా ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు అనేది వాస్తవం. ఆ సినిమా ఆ విధంగా ఆయన కెరీర్ లో పెద్ద ఫ్లాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: