అక్కినేని అన్నదమ్ములు ఇద్దరితో నటించి మెప్పించిన ముంబై భామ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో కెరియర్ టర్న్ తీసుకుంది. క్లాస్ గా కనిపిస్తే ఇక్కడ వర్క్ అవుట్ అవదని గుర్తించిన నిధి పూరి మాస్టర్ దగ్గర బాగానే హీరోయిన్ పాఠాలు నేర్చుకుంది. అందుకే ఇస్మార్ట్ శంకర్ లో అమ్మడి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న అమ్మడు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేజిక్కించుకుందని తెలుస్తుంది. 

 

తెలుగులోనే కాదు బాలీవుడ్ మీద పెద్ద ఆశలే పెట్టుకున్న ఈ అమ్మడు కెరియర్ ఇప్పుడిప్పుడే సరైన ట్రాక్ ఎక్కుతుందని చెప్పొచ్చు. ఇక ఈ మధ్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూస్ లో తన లవ్ స్టోరీల గురించి బయటపెట్టింది అమ్మడు. ఏకంగా 4వ తరగతిలోనే ప్రేమ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలిసిందట. ఇక కాలేజ్ డేస్ లో కూడా డేటింగ్ చేశానని నిర్మొహమాటంగా చెప్పింది నిధి అగర్వాల్. అంతేకాదు కాలేజ్ డేస్ లో ఒకతను చేసిన లవ్ ప్రపోజల్స్ ను జీవితంలో మర్చిపోలేనని అంటుంది అమ్మడు. మరి అంతగా సర్ ప్రైజ్ చేసిన అతగాడు ఎవరు.. ఇప్పటికి అతను టచ్ లోనే ఉన్నాడా అన్న విషయాలను మాత్రం బయట పెట్టలేదు నిధి అగర్వాల్.

 

గ్లామర్ విషయంలో కూడా ఎలాంటి అడ్డు చెప్పని ఈ అమ్మడు రానున్న రోజుల్లో టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ దక్కించుకునేలా ఉంది. ఒక్క స్టార్ సినిమా ఛాన్స్ వచ్చినా సరే అదరగొట్టేస్తా అంటున్న నిధికి ఏ స్టార్ ఛాన్స్ ఇస్తాడో చూడాలి. సమంత, అనుష్క, కాజల్ వంటి హీరోయిన్స్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తుండగా నిధికి వరుస ఛాన్సులు వచ్చేలా ఉన్నాయి. మరి అమ్మడు ఈ అవకాశాలతో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి: