మెగా డాటర్  సుస్మిత ఇన్నాళ్ళు తెర వెనక ఉన్న సంగతి తెలిసిందే. ఇంద్ర, సైరా సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ వంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. సుస్మిత గతకొన్ని రోజులుగా నిర్మాతగా మారబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం ఎప్పుడైతే స్వయంగా మెగాస్టార్ వెల్లడించారో అప్పటి నుంచి అందరిలోను ఆసక్తి మొదలైంది.

 

IHG

ఈ నేపథ్యంలో రీసెంట్ గా సుష్మిత సొంతగా ప్రొడక్షన్ మొదలు పెట్టి తొలి ప్రయత్నంగా వెబ్ సిరీస్ ప్రారంభించింది. సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పూజా కార్యక్రమాల తో మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ వెబ్ సిరీస్ ని మొదలు పెట్టారు. సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'జీ 5' ఓటీటీలో  ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

IHG

మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. క్రిమినల్స్, పోలీసులకు మధ్య జరిగిన నిజ ఘటనలకు సంబంధించిన కథనాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించడం ఇప్పుడు అందరిలోను ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఇన్స్పైరింగ్ బేస్డ్  కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

IHG

కేవలం ఒకే ఒక్క సినిమాని తీసిన ఆనంద్ రంగా ఆ తర్వాత మళ్ళీ తన నుంచి సినిమా రాలేదు. ఆనంద్ రంగా ఇంతక ముందు సిద్దార్థ్ తో ''ఓయ్'' అనే సినిమా రూపొందించగా ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అప్పుడు కనుమరుగైన ఈ దర్శకుడు మళ్ళీ ఈ వెబ్ సిరీస్ తో వస్తున్నాడు. ఇక హైదరాబాద్ లోని కాచిగూడ ప్రాంతంలో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో చిరు చిన్న పాత్రలో కొన్ని సెకండ్స్ కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తానికి మెగా డాటర్ వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీలోకి దూసుకు వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: