
సింగర్ ఉష బాల సుబ్రహ్మణ్యం గారి వల్లే తాను సినిమా పరిశ్రమ లోకి వచ్చారని అన్నారు. అలానే బాలు గారు నాకు తండ్రి లాంటివారు అని ఉష అన్నారు. బాలు గారు పాడుతా తీయగా లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను ప్రోత్సహించి ఇక్కడకి తీసుకొచ్చారన్నారు. నిజంగా ఆయన ప్రోత్సాహమే ఇంత స్థాయికి చేర్చిందని చెప్పడం జరిగింది. కేవలం తనకి మాత్రమే కాదని తనలాంటి ఎంతో మంది గాయని , గాయకులకు ఆయనే మంచి బాటని అందించారు అని ఉష చెప్పడం జరిగింది.
ఆయన ప్రోత్సాహం వల్లనే అంతా కూడా పెద్ద సింగర్స్ అయ్యారు అని చెప్పారు. ఎప్పుడూ బాలు గారు సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉండే వారు అన్నారు. తనని చిన్న పిల్లలను ట్రీట్ చేసినట్లు ట్రీట్ చేసేవారు అని ఆ మధుర జ్ఞాపకాలని గాయని ఉష పంచుకోవడం జరిగింది. ఎక్కువగా అయన ఎవరినీ పొగడరు మెప్పు పొందాలంటే చాలా కష్టం అని గాయని ఉష చెప్పారు. ఉష ఆయన తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం అదృష్టం అని అన్నారు. ఆమె ఆయనతో కలిసి అనేక సినిమాల్లో 15 పాటల దాకా పాడటం జరిగింది. ఇదంతా నిజంగా తన అదృష్టం అన్నారు. బాలు గారు లేక పోవటం వ్యక్తి గతంగా నాకు ఎంతో నష్టం అని ఉష చెప్పడం జరిగింది.