తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోలకు ఎంత క్రెజ్ ఉందో వారి పిల్లలకు కూడా అంతే క్రెజ్ ఉంది. వారిలో మహేష్ బాబు పిల్లలు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ తర్వాత అల్లు అర్జున్ పిల్లలు కూడా ఎప్పడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక అల్లు అర్జున్ పిల్లలు చేసే వీడియోస్ లక్షల సంఖ్యలో వ్యూస్ ని తీసుకొస్తుంటాయి. ఇక అల్లు అర్జున్ వారి పిల్లలను అభిమానులకు అభిమానులకు తెలిసేలా పెంచుతున్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ తన ఇద్దరి పిల్లలకు సంబందించిన వీడియోస్ ని ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాతో షేర్ చేస్తుంటాడు.

తాజాగా అల్లు అర్జున్ పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో అల్లు అర్హ, అయాన్ చేసిన డాన్సులు చేశారు. ఇక వారి డాన్సులను చూసి తండ్రిగా చాల మురిసిపోయాడు అల్లు అర్జున్. అయితే కొన్నేళ్లుగా అల్లు అర్జున్ పిల్లలు చేసే విన్యాసాలకు అల్లు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ తనయుడు అయాన్  కొరియాకు చెందిన బిటీఎస్ బ్యాండ్‌కు ఫిదా అయి స్టెప్పులు వేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమానులు షేర్  చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్స్ తండ్రికి మించిన కొడుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.



ఇక అల్లు అర్జున్ తనయుడు అయాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్‌ వేశారు. ఈ వేషధారణకు అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: