భారతదేశంలో ఏడు నెలల క్రితం సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు ఏడు నెలలుగా మూసివేసి ఉండటంతో నిర్మాతలు డిజిటల్ విడుదలకు మొగ్గు చూపారు. నిజానికి అక్టోబర్ 15వ తేదీ నుండి సినిమా థియేటర్లు మెల్ల మెల్లగా తెరచుకుంటున్నాయి. కానీ చాలామంది నిర్మాతలు ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కే ఓటు వేస్తున్నారు. ఉదాహరణకి అక్షయ్ కుమార్ సినిమా లక్ష్మీ బాంబ్ థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధమయ్యింది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి.


మార్చి నెలలో పదివేల థియేటర్లు మూసివేయబడ్డాయి అని ఒక అంచనా. అయితే అక్టోబర్ నెలలో దాదాపు 40 శాతం థియేటర్లు తెరుచుకున్నాయని టాక్. కానీ ఏ నిర్మాత కూడా తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధపడడం లేదు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్లను తెరవడానికి అనుమతిస్తే బాగుంటుందని కోరుకున్న నిర్మాతలు ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఏమాత్రం సంతోష పడడం లేదు. ప్రస్తుతం 50% సీట్ల సామర్థ్యం తో కరోనా జాగ్రత్తలతో సినిమా థియేటర్లను నడుపుతున్నారు నిర్వాహకులు. అయితే నిర్మాతలు మాత్రం తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి అసలు సాహసించడం లేదు. మరోవైపు కొంతమంది ప్రేక్షకులు మాత్రం సినిమాలను వెండితెరపై చూడాలని తపన పడుతున్నారు. కానీ నిర్మాతలు మాత్రం కొన్ని రోజుల పాటు వేచి చూసి ఆ తర్వాత తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.


ఇప్పటికే కరోనా వైరస్ శక్తి తగ్గిందని.. కరోనా బారిన పడినా.. చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని రోజుల సమయం గడిస్తే బ్యాంక్స్ ఇన్ రాకముందే కరోనా వైరస్ బలహీన పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైజాగ్ నగరంలో ఇప్పటికే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను మల్టీప్లెక్స్ థియేటర్లలో రిలీజ్ చేశారు. థియేటర్లకు ఎంత మంది ప్రేక్షకులు వస్తారనేది తెలుసుకోవడానికి ఈ సినిమాలను విడుదల చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ కరోనా టైం లో పాత సినిమాలను చూడటానికి ఎవరు సాహసించ కాకపోవచ్చు. ఏదైనా ఒక కొత్త సినిమా విడుదలయితే ప్రేక్షకులు వస్తారా లేదా అన్నది తెలిసిపోతుంది. కానీ విడుదల చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: