బిగ్ బాస్ సీజన్ 4 లో ఏడవ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ రంగు పడుద్దిలో భాగంగా బిగ్ బాస్ చెప్పిన ఇద్దరిలో ఒకరిని ఒకరు కన్ విన్స్ చేసుకుని ఒకరిని నామినేట్ చేసి.. మరికరిని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అఖిల్, మోనాల్ లలో అఖిల్ సేవ్ అయ్యి మోనాల్ ను నామినేట్ చేశాడు. ఇక సోహెల్, అవినాష్ లలో అవినాష్ నామినేట్ అయ్యాడు. అభిజిత్, హరికలలో హారికని సేవ్ చేసి అభిజిత్ నామినేట్ అయ్యాడు.

అలానే 'లాస్య, దివిలలో లాస్య సేవ్ అయ్యి దివి నామినేట్ అయ్యింది. ఇక చివరగా మెహబూబ్, అరియానాలలో అరియానా నామినేట్ అయ్యి మెహబూబ్ ను సేవ్ చేసింది. ఈ వారం ఏడుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అమీ తుమీ టాస్క్ లో భాగంగా నోయెల్ ఈ వారం నామినేషన్ లో డైరెక్ట్ గా ఉన్నాడు. ఫైనల్ గా బిగ్ బాస్ ఏడవ వారంలో హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ వారం ఈ వీక్ నుండి వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

నామినేషన్ ప్రక్రియలో భాగంగా కొందరు ఊరకనే సాక్రిఫైజ్ చేయగా కొందరు మాత్రం నువ్వా నేనా అనేలా ఈ టాస్క్ జరిగింది. ఫైనల్ గా ఏడుగురు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఈ వారం నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: