ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో సూపర్ సక్సెస్ అందుకని మంచి క్రేజ్, మరింత పేరు దక్కించుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాతో పాటు అందులోని పాటలు కూడా జాతీయస్థాయిలో పెద్ద సక్సెస్ ని అందుకొని అందరికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక దాని అనంతరం ప్రస్తుతం క్రియేటివ్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో భారీగా నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇటీవల లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాలో రష్మిక మరియు అల్లు అర్జున్ ఇద్దరూ మాస్ పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. ఇక లాక్ డౌన్ తరువాత పలు మార్లు ఫ్యాన్స్ కు పుష్ప లేటెస్ట్ లుక్ లో దర్శనమిచ్చిన అల్లు అర్జున్, తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో మధ్యలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు.
ఇక నిన్న ఒకానొక సందర్భంలో బయటకు వచ్చిన అల్లు అర్జున్ లేటెస్ట్ బయటకు రావడం జరిగింది. వైట్ టీ షర్ట్ క్యాప్ ధరించి ఉన్న అల్లు అర్జున్ ఆ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఆ సినిమా కోసం అల్లు అర్జున్ ఫుల్ గా హెయిర్ తో పాటు గడ్డం కూడా పెంచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ముగించి దీనిని వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు యూనిట్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: