మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా రాధేశ్యామ్ లో నటిస్తున్న ప్రభాస్, దాని అనంతరం నాగ అశ్విన్ తో వైజయంతి మూవీస్ వారి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారికల్ డ్రామా మూవీ ఆదిపురుష్ సినిమా కూడా చేయనున్నారు. కాగా ఈ సినిమాని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్నారు. ఇక తన కెరీర్ లో ఎన్నో మంచి విజయాలు సొంతం చేసుకుని హీరోగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కెరీర్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలు మాత్రం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి.

ఆ రెండు సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి గొప్ప విజయాలు అందుకుని టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి పెంచడంతో పాటు హీరోగా ప్రభాస్ స్టామినాని అమాంతం ఆకాశానికి తీసుకువెళ్లాయి అనే చెప్పాలి. ఇక దానితో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పేరు, మార్కెట్ వాల్యూ తో ముందుకు సాగుతున్నారు. ఇక తన కెరీర్ లో హీరోయిన్ అనుష్క శెట్టితో మూడు సినిమాలు చేసారు ప్రభాస్, వాటిలో ఒకటి మిర్చి, అలానే బాహుబలి రెండు భాగాల సినిమాలు. కాగా ఈ మూడు సినిమాలు విజయాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అలానే వీటి ద్వారా తనకు మంచి స్నేహితుడు ప్రభాస్ రూపంలో దొరికాడు అంటూ అనుష్క పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అలానే కొన్నాళ్ల నుండి వీరిద్దరి మధ్యలో ప్రేమ ఉందని, అలానే ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు కూడా పచారం అవుతున్నాయి. కాగా వాటిని వారిద్దరూ ఎన్నో సార్లు ఖండించడం జరిగింది.

ఇకపోతే నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హీరోయిన్ అనుష్క ఆయనని ఉద్దేశించి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ప్రభాస్ ని ముద్దుగా పప్సు  అని సంబోధిస్తూ, మంచి చెడుల్లో నాకు తోడుగా ఉంటూ ఎప్పుడూ నాకు సహకరించే నీకు హ్యాపీ బర్త్ డే అంటూ అనుష్క పెట్టిన పోస్ట్ పై కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మా హీరోని ఇంత ముద్దుగా పప్సు అంటూ సంబోధిసితున్నారు అంటే మీ ఇద్దరి మధ్యన మంచి అనుబంధమే ఉంది అని కొందరు అంటుంటే, లేదు లేదు వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ మరికొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్యన ఉన్న మంచి స్నేహం కారణంగానే ప్రభాస్ ని ముద్దుగా అలా అనుష్క పిలుస్తుంటారు తప్ప వారిద్దరి మధ్యన ప్రేమ వంటిది ఏమి లేదని పలువురు వారి సన్నిహితులు చెప్తున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: