వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఖైదీ నెంబర్ 150 ద్వారా సినిమాల్లోకి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమా కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ పోషించారు. కాగా రిలీజ్ అనంతరం ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. ఇక దాని అనంతరం గత ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఆ మూవీతో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు.

ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ఒక మాజీ మాజీ నక్సలైట్ పాత్రని పోషిస్తున్నట్లు టాక్. ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దీనికి మ్యూజిక్ ని అలానే తిరు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ కి ముందు 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని అనంతరం మలయాళం మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇందులో మెగాస్టార్ పాత్రకు సంబంధించి హీరోయిన్ ఉండదని అలానే ఇందులో ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని కాగా ఆ పాత్ర కోసం మెగాస్టార్ ఇప్పటికే  పలు వ్యాయామాలు చేస్తూ డైటింగ్ విషయమై పూర్తి కేర్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల కొంత సన్నబడ్డ మెగాస్టార్ ఆ పాత్రకోసం మరింతగా బరువు తగ్గనున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమా కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు వినాయక్ కొద్దిపాటి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎంతైనా మెగాస్టార్ మొదటి నుంచి తను చేసే సినిమాలకు సంబంధించి ఈ విధంగా కష్టపడుతూ ఉంటారని ఊరికే మెగాస్టార్ అయిపోతారా ఏంటి, కష్టేఫలి అన్నట్లుగా ఆయన కష్టమే ఆయనని ఈరోజు ఈ స్థాయిలో నిలిపిందని పలువురు ప్రేక్షకులు అభిమానులు అభిప్రాయపడుతూ తమ స్పందన తెలియజేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: