ఫేడౌట్‌ అనే మాట హీరోలకు వర్తిస్తుందిగానీ.. హీరోయిన్స్‌కు కాదు. స్టార్స్‌తో జతకట్టిన భామలు ప్రస్తుతం వాళ్లకు దూరంగా ఉండొచ్చు. కానీ.. ఏదో ఒక మూవీ చేతిలో వుంటోంది. లేదంటే.. తమిళం.. కన్నడలో ఇండస్ట్రీలో నటిస్తూ వుండొచ్చు. ఇలా ఏదో ఒక ఇండస్ట్రీ వీళ్లను ఆదుకుంటోంది.

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లయింది. ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోతో జత కట్టకపోయినా.. బిజీనే. సీటీమార్‌లో గోపీచంద్‌ సరసన కబాడీ కోచ్‌గా నటిస్తోంది. హిందీలో "బోలే చూడియన్‌' అనే మూవీ చేస్తోంది. వెండితెరను ఏలేసిన మిల్కీబ్యూటీ.. ఓటీటీని మాయ చేస్తోంది. ప్రస్తుతం రెండు వెబ్‌ సిరీస్‌లో  నటిస్తోంది తమననా. మరోవైపు.. ఆహాలోని ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

చేతిలో తెలుగు సినిమాలుంటేనే ఫామ్‌లో ఉన్నట్టు.. లేదంటే ఫేడౌట్‌ అనుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సమంత నటిస్తున్న తెలుగు మూవీ ఒక్కటీ లేకపోయినా.. తమిళంలో రెండు సినిమాలున్నాయి. మరోవైపు.. 'ది ఫ్యామిలీ మేన్‌' అనే వెబ్‌ సిరీస్‌లో  నెగిటివ్‌ టచ్‌ వున్న రోల్‌ పోషిస్తోంది. మరోవైపు సామ్‌జామ్‌ షో హోస్ట్‌గా సెలబ్రిటీస్‌ను ఇంటర్వ్యూ చేస్తూ గడిపేస్తోంది.

ఓ వెలుగు వెలిగి కనిపించకుండాపోతే ఫేడౌట్‌ అంటాం. కానీ.. ఈ పదాన్ని హీరోయిన్స్‌ మీద ప్రయోగించలేం. ప్రస్తుతం వీళ్లకున్న ఆప్షన్స్‌ ఎవరికీ లేవు. తెలుగు కాకపోతే.. తమిళం.. లేదంటే హిందీ. ఏదో ఒక భాషలో ఏదో ఒక సినిమా చేస్తూనే వుంటారు. ఒక వేళ సినిమాలు  లేకపోతే.. వెబ్‌ సిరీస్‌లు ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు.. గేమ్‌షోస్‌కు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా ఉండే అవకాశం బుల్లితెర ఇస్తోంది. మొత్తానికి మన హీరోయిన్ లు ఫెయిల్యూర్స్ చవి చూసినా.. బిజీగానే ఉన్నారు. తెలుగు కాకపోతే.. తమిళం.. హిందీ ఆఫర్స్‌ అందుకుంటూ తామేంటో నిరూపించుకుంటున్నారు. అరకొర సినిమాలున్నా...వెబ్ సిరీస్ లు ఆదుకుంటున్నాయి. హోస్ట్‌గా.. జడ్జిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.











మరింత సమాచారం తెలుసుకోండి: