ఎనర్జటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో రామ్. ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు పరితపిస్తుంటాడు. తన తొలి సినిమా దేవదాసుతోనే భారీ హిట్ అందుకున్న రామ్ తర్వాత అనేక సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరణ, మన్ననలు అందుకున్నాడు. ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా.. రామ్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో ఫుల్ మాస్ పాత్రతో అందరిని ఆకట్టుకున్న రామ్ మరో సారి తనలోని అన్ని యాంగిల్స్‌ని చూపించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ ప్రయత్నం నుంచి వస్తుందే రామ్ నూతన చిత్రం రెడ్. ఇప్పుడు రామ్ రెడ్ సినిమాలో తనోని మాస్ అండ్ క్లాస్ కోణాల్ని అద్భుతంగా చూపించనున్నాడు. నిజానికి ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది.

ఈ చిత్రంలో రామ్ రెండు పాత్రలలో చేశాడు. వాటిలో ఒకటి ఊర మాస్‌గా కనపించగా మరొకటి పక్కా క్లాస్‌గా కపించాడు. రెండింటిలోనే తనదైన నటన కనబరిచిన రామ్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెట్టుకున్నాడు. ఈ సినిమా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో మాల్వికా శర్మా, అమ్రితా అయ్యర్‌లు హీరోయిన్‌లుగా చేశారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో టాలెంటెడ్ నటి నివేథా పేతురాజ్ కనిపించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను జరుపుకున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అందరూ ఎంతో కష్టపడి చేశారని అన్నారు.

అంతేకాకుండా నిర్మాత రవికిషోర్ గురించి మాట్లాడకుండా వెళ్లకూడదంటూ చెప్పుకొచ్చాడు. ‘నేను స్వయంవర సినిమా తర్వాత నాకు ఎవరరూ సినిమాలు ఇవ్వడంలేదు. ఆ సమయంలో నేను నా సొంతూరు భీమవరం వెళ్లిపోయాను. అటువంటి సమయంలో నాకు ఫాన్ చేసి పిలిపించి నువ్వే కావాలి సినిమా కథ రాయించారు. దాని తరువాత నువ్వు నాకు నచ్చావ్ కథ నేను రాసేటప్పుడు ఆ ఫైల్ తన వద్దనే ఉంచుకొని అర్థరాత్రి నాకు ఫోన్ చేసి ఇందులో ఈ డైలాగ్ ఎంతబాగుందని నాకు వినిపించేవారు. నేను రాసిన కథ మొత్తం చదవేవారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇటువంటి వారికి నేను నాలుగు సినిమాలు రాసే అదృష్టం నాకు దక్కడం నాకు వరంగా అనుకుంటున్నాను.

ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా వారితో నేను పనిచేయడం నాకు చాలా గొప్ప అనుభవంగా ఉంది. తాను ఎంత గొప్ప దర్శకుడు అయినా రవి కిషోర్‌కి రుణపడిఉంటానంటూ ఆయన కాళ్లు పట్టుకున్నాడు. ఈ దృశ్యం చూసిన అభిమానులు హర్షద్వానాలతో మారుమోగిపోయింది. ఇదిలా ఉంటే రెడ్ సినిమాలో హీరో రామ్ తన నటన, డాన్స్, డైలాగ్‌లతో ఆకట్టుకుంటే హీరోయిన్‌లు తమ అందాలతో ఆకర్షించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి రేపు విడుదల కానున్న ఈ సినిమా వారి అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: