ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బోణీ కపూర్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శృతి హాసన్ కీలక గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది. ఇక హీరోయిన్ లు అంజలి మరియు నివేథా థామస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.  భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా టీజర్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్..ఇక టీజర్ లో లాయర్ గా పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్ అదిరింది. అబ్జక్షన్ యువర్ హానర్.. అంటూ పవన్ కళ్యాణ్ కోర్టులో గర్జిస్తున్న సీన్ అదిరిపోయింది...కోటు వేసుకొని వాదించడము వచ్చు...

కోటు తీసి కొట్టడము వచ్చని, చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కలిగించేలా ఉంది..ప్రస్తుతం ఈ టీజర్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులనుంచి కూడా విపరీతమైన స్పందన వస్తోంది.. ఇదిలా ఉంటె మరోవైపు ఈ టీజర్ కి నెగిటివ్ టాక్ వస్తోంది.. నిజానికి అమితాబ్ పాత్రను పవన్ చేస్తాడని తెలిసినపుడు ఫాన్స్ షాక్ అయిన మాట వాస్తవం. పాసివ్ రోల్ లో పవర్ స్టార్ ని ఎలా ఉహించుకోవాలి అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ, అంతలో తమిళంలో అజిత్ కుమార్ ఇమేజ్‌కి అనుగుణంగా మార్పులు చేసి, ఆ సినిమా సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఈ సినిమా పవర్ స్టార్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా నమ్మారు.సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది..
 
తమిళంలో ఒక ఫైట్ సీన్, రెండు, మూడు సన్నివేశాల మినహా కథలో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ వకీల్ సాబ్ లో మాత్రం కథలో కూడా మార్పులు చేసినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా అమితాబ్, అజిత్ మాదిరిగా ఏదో ట్రాన్స్‌ లో వున్న వకీల్‌ లా కాకుండా, అసహనంతో ఊగిపోయే లాయర్‌ గా పవన్ ను సినిమాలో చూపించబోతున్నారు. దాంతో అనవసరపు స్పీచ్ లు ఎక్కువైయ్యాయి అట. అలాగే హీరోయిన్ ను యాడ్ చేయడం, ఆమెతో రెండు మూడు లవ్ సీన్స్ కూడా మిక్స్ చేయడంతో.. వకీల్ సాబ్ కాస్త ఓవర్ యాక్షన్ సాబ్ అయిపోయిందని అంటున్నారు పలువురు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: