సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అజయ్ దేవగన్ మేడే సినిమాలో నటిస్తుంది. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కు వెళ్లడానికి రకుల్ ఇబ్బంది పడుతుంది. అదేంటి రకుల్ ఎందుకు షూటింగ్ కు వెళ్లడానికి నిరాకరిస్తుంది అనుకోవచ్చు. మాములుగా అయితే షూటింగ్ అంటే చలాకీగా ఉంటుంది. అయితే వీకెండ్ అని సాటర్ డే, సండే రెస్ట్ తీసుకున్నట్టు ఉంది. అందుకే మండే షూటింగ్ కు వెళ్లడానికి బద్ధకంగా ఉందని అనిపిస్తుంది కావొచ్చు అందుకే అలా కన్ను కొడుతూ కొంటెగా చూస్తుంది.

మండే బ్లూస్, వర్క్ మోడ్ అంటూ ఇన్ స్టాగ్రాం లో కామెంట్ పెట్టింది. మొత్తానికి రకుల్ షూటింగ్ వెళ్లడానికి కూడా మూడ్ రావట్లేదని అంటుందన్నమాట. అయితే రకుల్ అలా కొంటెగా కన్ను కొడితే ఇక్కడ కుర్రాళ్ల పరిస్థితి ఏమవ్వాలన్నది ఆలోచించాలి. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అమ్మడు ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా బిజీ అవుతుంది. క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీలో నటించిన రకుల్ నితిన్ చెక్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.

మన్మథుడు 2 తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని రకుల్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ బిజీ అవుతుంది. ఇక వీటిలో ఒక సినిమా హిట్టైనా మళ్లీ తెలుగులో అమ్మడికి క్రేజ్ వచ్చినట్టే. చూస్తుంటే రకుల్ కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో రకుల్ తన కెరియర్ లో జోష్ కనబరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: