ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా మల్టీ స్టారర్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు హీరోలను కలిపి తెరపై చూస్తే వచ్చే కిక్కే వేరు. ఇక ఒక హీరో ఇంకొక హీరో సినిమాలో హీరోగా నటిస్తే ఆ సినిమా ఎలా ఉన్నాకాని హిట్ అవ్వడం పక్కా. ఇక చూసుకున్నట్లైతే ఈ మధ్య కాలంలో ఇద్దరు స్టార్  హీరోలు కలిసి ఒకే సినిమాలో కలిసి  నటిస్తే ఆ సినిమాలకు వస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ నాలుగు ఉన్నా కూడా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నారు. ఇక ఇద్దరు హీరోల్లో ఒకరు నెగిటివ్ పాత్రలో కనిపిస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. విజయ్ సేతుపతి కూడా ఇటీవల మాస్టర్ సినిమాతో నెగిటివ్ పాత్రతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విలన్ పవర్ఫుల్ గా ఉంటేనే హీరో రేంజ్ అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. ఇక మనం చూసినట్లయితే మాస్టర్ సినిమాలో విజయ్ పాత్ర కంటే ఎక్కువగా సేతుపతి పాత్రనే హైలెట్ అయ్యింది. ఒక విధంగా తెలుగు ఆడియెన్స్ కు అతని పాత్రనే ఎక్కువగా నచ్చింది. అసలు విషయానికి  వస్తే.. మాస్టర్ సినిమా ప్రభావం ఇప్పుడు సలార్ పై పడ్డట్లు తెలుస్తోంది.


 ఎందుకంటే ఆ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని విలన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఖరారు  అవ్వలేదు గాని దాదాపు  ఫైనల్  అయ్యేలా ఉన్నారని సమాచారం అందుతుంది. ఒకవేళ ఆ విలక్షణ నటుడిని  ఫైనల్  చేస్తే మాత్రం సినిమాపై అంచనాలు వేరే  లెవెల్లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ ప్రభావం ప్రభాస్ మీద పడుతుందేమోనని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: