ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ వారందరిలో కొంతమంది హీరోలు మాత్రమే తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇందులో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా తనదైన స్టైల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే డిఫరెంట్ మూవీలతో వరుణ్ దూసుకుపోతున్నాడు. కానీ వరుణ్ తేజ్ ఇంకా ఎక్కడో కాస్త వెనకబడుతున్నాడనే కారణంతో.. నాగబాబు వరుణ్ కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. కొడుకును మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకే నాగబాబు ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోల నుంచి చిన్నా చితకా హీరోలు కూడా ఈ రీమేక్ సినిమాల పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వేరే భాషల్లో రిలీజై హ్యాట్రిక్ రికార్డు సాధించిన సినిమాలను సెలక్ట్ చేసుకుని వాటిని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఇక ఈ రీమేక్ సినిమాలతో పాటుగా తెలుగులో పాత సినిమాలను సెలక్ట్ చేసుకుని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా మార్చేసి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కూడా ఓ పాత సినిమాను సెలక్ట్ చేసుకుని దానిని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పవర్ స్టార్ నటించిన ‘జానీ’ సినిమాతో పాటుగా  చిరు నటించిన ‘ఛాలెంజ్’, కొదమ సింహం వంటి సినిమాలను వరుణ్ సెలక్ట్ చేసుకున్నారట. ఈ సినిమాలను ట్రెండ్ కు తగ్గట్టుగా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారట వరుణ్ తేజ్. ఇందులో చిరు నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు చిరు కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ గా నిలిచాయి.  అయితే ఈ సినిమాల్లో వరుణ్ నటిస్తే బాగుంటుందని మెగా నాగబాబు అనుకుంటున్నారట.

అయితే ఇదే సమయంలో ఈ సినిమాల్లో వరుణ్ కాకపోయినా.. మెగా హీరోలు ఎవరైనా నటిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారట. ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తే ఇంకా బాగుంటుందని భావిస్తున్నారట. ఇకకపోతే వరుణ్ తేజ్ ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘గని’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ‘ఎఫ్ 2’ సీక్వెల్ ఎఫ్ 3 మూవీలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. వాటితో పాటుగా ఈ సినిమాలపై కూడా వరుణ్ కసరత్తులు మొదలు పెడుతున్నాడని సమాచారం. ఇక ఇదే ఏడాదిలో వరుణ్ తేజ్ ను ఒక ఇంటివాడిని చెయ్యాలని నాగబాబు ఆలోచిస్తున్నారట. మంచి అమ్మాయిని చూసి వరుణ్ తేజ్ పెళ్లి చెయ్యాలని నాగబాబు.. ఇప్పటికే అమ్మాయిని వెతికే పని కూడా మొదలు పెట్టాడట. చూడాలి మరి వరుణ్ తేజ్ ఈ రీమేక్ సినిమాలను నేటి జనరేషన్ కు తగ్గట్టు తెరకెక్కిస్తారా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: