టాలీవుడ్ లో ఉప్పెన ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తొలి వీకెండ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ డెబ్యూ హీరో రాబట్టలేనన్ని కలెక్షన్లను రాబట్టుకున్నాడు వైష్ణవ్.. దీంతో ఇప్పటివరకు అల్ టైం డెబ్యూ హీరో గా రికార్డులకెక్కాడు.. ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది..

ఆమెకు ఇప్పుడు ఓ అరడజను సినిమాలు లైన్ లో ఉన్నాయి.ఈ సినిమా లో నటనతో అందరి హృదయాలను కట్టిపడేసింది కృతి.. మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ తో కృతి శెట్టి త‌న రెండో సినిమాకు ఏకంగా 75ల‌క్ష‌ల‌ను డిమాండ్ చేస్తోంద‌ని టాక్. ఉప్పెన సినిమా విడుద‌లకు ముందు నుంచి విడుద‌ల అయిన త‌ర్వాత కృతి శెట్టి గురించి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చూడ్డానికి ఎంతో చిన్న పిల్లలా క‌నిపించే ఈ అమ్మ‌డు గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ మంది చ‌ర్చిస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ నిర్మాత తన సినిమాలో నటించమని.. వెళితే.. అక్షరాలా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అయితేనే చేస్తానని చెప్పిందట. అంతే కాదు.. కారవ్యాన్, కాస్ట్యూమ్స్, ఫుడ్, అసిస్టెంట్స్‌కి అయ్యే ఖర్చు ఎక్స్‌ట్రా అని చెప్పిందట. ఆమె ‘ఉప్పెన’ చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 6 లక్షలు. ఆ తర్వాత సినిమాలకు రూ. 60 లక్షల రెమ్యునరేషన్ అనేలా వార్తలు వచ్చాయి. అంటే 10 రెట్లు పెంచేసింది. అయినా సరే ఫ్రెష్ ఫేస్ కదా.. అని నిర్మాతలు రూ. 60 లక్షలకు కూడా ఓకే అయ్యారు. కానీ ఇప్పుడు రూ. కోటి ప్లస్ ఎక్స్‌ట్రా ఖర్చులంటూ.. ఓ స్టార్ హీరోయిన్‌ అడిగినంత అడిగే సరికి.. ఆమెకో నమస్కారం పెట్టి.. నిర్మాత వెనక్కి వచ్చేశాడంట.బేబమ్మ.. బేబమ్మ అని అంతా నెత్తికి ఎక్కించుకున్నారని ఫీలైపోతుందో.. లేక ఉన్న అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుందో తెలియదు కానీ.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అక్షరాలా ఆమె పాటిస్తుంది. అయితే ఇలా హై రేంజ్ ఊహించుకోవడం కూడా అంత కరెక్ట్ కాదని కొందరు విమర్శకులు ఆమెకు హితబోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: