టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అందరి మ్యూజిక్ డైరెక్టర్ లకి భిన్నంగా తమన్ ట్రోల్ల్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు.ఓ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు అంతే చాలు… మీమర్స్‌ యాక్టివేట్‌ అయిపోతారు. అదే తమన్‌ సంగీతమందించిన సినిమాలోని లిరికల్‌ సాంగ్‌ బయటకు వచ్చిందంటే చాలు మీమర్స్‌కు పండగే. ఆ బీట్‌లో గతంలోనే ఏదైనా పాట వచ్చిందా అని వెతికేవారు. పనిలోపనిగా తమన్‌ పాత పాటలు కూడా వినేవారు. ఏదైనా దొరికిందా… ఇక మీమ్స్‌, మీమ్‌ వీడియోస్‌ సిద్ధమే. మాస్‌ సాంగ్‌ వచ్చింది మొదలు 'డప్పుల మోత' మొదలైంది అంటూ వాయింపు మొదలయ్యేది. ఇక పనిగట్టుకొని మరి మీమర్స్ తమన్ ని విపరీతంగా ట్రోల్ చేసే వారు.అయినా తమన్ ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు.

ఇక 'అల వైకుంఠపురంలో' సినిమాకి రియల్ హీరో తమన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సినిమాకి ప్రాణం పోసి సంగీతం అందించాడు. నిజానికి తమన్ కాక వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుంటే ఈ సినిమా ఖచ్చితంగా అంత పెద్ద హిట్ అయ్యుండేది కాదు. ఈ సినిమా తమన్‌ మ్యూజిక్‌లో చాలామార్పులు తెచ్చింది. ఆ సినిమా తర్వాత మీమర్స్‌కు పెద్దగా పని లేదనే చెప్పాలి. 'వి', 'క్రాక్' సినిమాల మ్యూజిక్ కాపీ అనిపించినా , 'సోలో బతుకే సో బెటర్‌',  'వైల్డ్‌ డాగ్‌' లాంటి సినిమాలకి కాపీ కామెంట్లు పెద్దగా కనిపించలేదు. 'వకీల్‌సాబ్‌' దగ్గరకు వచ్చేసరికి ఇంకా బెటర్‌ అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడనే చెప్పాలి. పవన్‌తో సినిమా లైఫ్‌ టైమ్‌ గోల్‌ కాబట్టి చక్కటి సంగీతం ఇచ్చాడని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.


బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌లో తమన్‌ కొట్టేవాడే లేడని మరోసారి 'వకీల్‌సాబ్‌' నిరూపించింది. పవన్‌ ఎలివేషన్‌ సీన్స్‌ పండటంలో తమన్‌ మ్యూజిక్‌కి కీలక పాత్ర వహించిందనే అని చెప్పాలి. ఇప్పుడు తమన్ ని ట్రోల్ చేసిన మీమర్స్ మళ్ళీ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: