ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఎఫ్3 కాగా మరొకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలపై రూపొందుతున్న నారప్ప. అయితే వీటిలో ముందుగా నారప్ప మే 14న రిలీజ్ కానుంది. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ మూవీ తెలుగు రీమేక్ గానే ప్రస్తుతం నారప్ప తెరకెక్కుతోంది. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక వెంకటేష్ ఒక పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కొన్నాళ్ల క్రితం పూర్తి అయింది. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. మంచి యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా ఈ మూవీ కూడా భారీ సక్సెస్ అందుకని వెంకటేష్ కి కెరీర్ పరంగా మరో విజయయాన్ని అందించడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా కొనసాగుతుండటంతో ఇప్పటికే ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఒక దానివెంట ఎం,మరొకటి కొన్నాళ్లపాటు వాయిదాలు పడుతున్నాయి. మరోవైపు నారప్ప తో పాటు రానున్న ఆచార్య కూడా వాయిదా పడే ఛాన్స్ కనపడుతుంది. అలానే నారప్ప ని కూడా వాయిదా వేయాలని యూనిట్ ఆలోచన చేస్తోందని అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి సరికొత్త విడుదల తేదీని యూనిట్ ప్రకటించిందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: