కరోనా కేసులు ఇప్పటికే 2 లక్షల స్థాయిని దాటిపోవడంతో వచ్చేనెల పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరి ఊహలకు అందడం లేదు. ఇలాంటి పరిస్థితులను ఎదిరిస్తూ షూటింగ్ లు కొనసాగిస్తూ వచ్చిన ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఇక షూటింగ్ లు కొనసాగించలేమని ఒక నిర్ణయానికి రావడంతో త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రకటన వస్తుంది అని అంటున్నారు.  


ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన చర్చలు ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్నాయని ధైర్యం చేసి షూటింగ్ లు కొనసాగించినా వచ్చేనెల సినిమాలువిడుదల చేసే అవకాశాలు లేకపోవడంతో సాహసం చేసినా ప్రయోజనం ఏమిటి అనే తీరులో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు టాక్. వాస్తవానికి షూటింగ్ లు ఆపు చేసుకోమని ప్రభుత్వాలు సూచనలు ఇవ్వనప్పటికీ నిర్మాణ సంస్థలు ఎవరికీ వారే స్వచ్చందంగా తమ  సినిమాల షూటింగ్ లను ఆపు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తితే ఈసారి ఫిలిం ఇండస్ట్రీ కోలుకోవడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో దీని ప్రభావం భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘పుష్ప’ ‘రాధే శ్యామ్’ ‘కేజీ ఎఫ్ 2’ మూవీల మార్కెట్ పై ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చే వారం ఒక భారీ సెట్ లో పాటను చిత్రీకరించ వలసిన ‘రాదే శ్యామ్’ మూవీ షూటింగ్ అదేవిధంగా ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ లు కూడ వాయిదా పడతాయి అని అంటున్నారు. ఇప్పటికే క్రితం సంవత్సరం సమ్మర్ దసరా సీజన్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ ను  కూడ పూర్తిగా మిస్ చేసుకుంటే ఇప్పటికే రిలీజ్ కు రెడీ అయిన సుమారు 20 సినిమాలు ఆతరువాత సరైన రిలీజ్ డేట్స్ దొరకక బయ్యర్ల నుండి స్పందన తక్కువై ఆర్థికంగా భారీగా నష్టపోయే ఆస్కారం ఉంది అని అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: