ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. చిత్ర సీమకు వచ్చింది గాయకుడు కావాలని. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా చాన్స్ వచ్చింది. దాంతో వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుని చిత్ర సీమలో గట్టిగా నిలబడ్డారు. స్వర చక్రవర్తిగా చిర కీర్తిని ఆర్జించారు. ఆయన దాదాపుగా వేయి చిత్రాలకు మ్యూజిక్ చేసి తనకు తిరుగులేదు అనిపించుకున్నారు.

చక్రవర్తి 70, 80 దశకాల్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ ని ఏలుతున్నారు.  ఆ టైమ్ లో ఆయనకు సమతా ఆర్ట్స్ మూవీస్ వారి మల్లెపూవు సినిమా చేసే చాన్స్ వచ్చింది. ఆ సినిమాలో హీరో శోభన్ బాబు. సినిమా మొత్తం క్లాసిక్ సాంగ్స్ తో ఉంటుంది. కధ అలాంటిది. ఈ మూవీ చేస్తున్న టైమ్ లో చక్రవర్తి ఫుల్ బిజీ.

ఆయన ఎంత బిజీ అంటే రోజంతా రికార్డింగ్ స్టూడియోలో ఉన్నా కూడా ఇంకా పాటలు చేయాల్సినవి చాలా ఉండేవి. ఆ సమయంలో చక్రవర్తికి కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోవడానికే టైమ్ ఉండేది కాదు. ఏ తెల్లవారుజామునో ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లారుతూనే రికార్డింగ్ థియేటర్లకు పరుగులు పెట్టేవారు.

ఆ సమయంలో ఆయన ఎక్కడ వీలైతే అక్కడే పాటలకు ట్యూన్లు కట్టేవారట. అలా ఇంటి నుంచి రికార్డింగ్ థియేటర్ కి వచ్చేలోగా ఆయన ఒక అందమైన పాటకు ట్యూన్ కట్టేశారు. ఆ పాటే చిన్నా మాట ఒక చిన్న మాట. మల్లెపూవు లో హీరోయిన్ లక్ష్మి మీద చిత్రీకరించిన ఈ సాంగ్ ఎప్పటికీ సూపర్ హిటే. పి సుశీల పాడిన ఈ సాంగ్ ని అన్ని తరాల  మ్యూజిక్ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఈ సాంగ్ ని కారులో కూర్చుని ట్యూన్ కట్టేసి ఆపాతమధురం చేసిన స్వర చక్రవర్తి నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అనాటి టాప్ హీరోలు అందరికీ ఆయన మ్యూజిక్ చేసి సూపర్ హిట్లు ఎన్నో ఇచ్చారు.





మరింత సమాచారం తెలుసుకోండి: