సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం పోలీస్ స్టోరీ. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్షన్ హీరో థ్రిల్లర్ మంజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా సత్య ప్రకాష్ కీలకమైన పాత్రలో నటించి సినిమా హిట్ అవడానికి ఎంతో దోహదపడ్డారు. 1996లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించి రికార్డులను సృష్టించింది. 

ఈ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ "కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైతే  కనిపించని నాలుగో సింహమే రా పోలీస్" అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులు చెప్తూ ఉంటారు. సాయికుమార్ ని ఈ రేంజ్ యాక్షన్ చిత్రంలో చూపించడం ఒక థ్రిల్లర్ మంజు కే చెల్లింది. యాక్షన్ హీరో అయినా  మంజు మరొక యాక్షన్ హీరో కి ఈ రేంజ్ యాక్షన్ హిట్ ఇవ్వడం గొప్ప విషయం అని చెప్పాలి. స్టంట్ మాస్టర్ గా ఉన్న థ్రిల్లర్ మంజు తొలి సారి దర్శకత్వం వహించిన లాకప్ డెత్ సినిమాతో సాయి కుమార్ కు మంచి గుర్తింపు వచ్చింది. పోలీస్ స్టోరీ సినిమా కన్నడ తెలుగు సినిమాలలో విజయవంతమై సాయికుమార్ పోలీస్ పాత్రలు పోషించడానికి దారితీసింది.

ఈ సినిమాకు సీక్వెల్ గా 2007లో పోలీస్ స్టోరీ 2 సినిమా వచ్చింది. ఇందులో సాయికుమార్ అదే పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా మొదటి సినిమా రేంజ్ లో హిట్ ఇవ్వలేక పోయింది. ఈ సినిమాలో సాయి కుమార్ తర్వాత ఆ రేంజ్ లో నటించి ప్రేక్షకుల గుర్తింపు అందుకున్న నటుడు సత్యరాజ్. సత్యరాజ్ నటించిన నటనకు ఆరోజుల్లో ప్రేక్షకులు ఎంతగా థ్రిల్ అయ్యారు అంటే ఒక విలన్ పాత్ర చేసిన నటుడుకి కూడా ఇంత మంది ఫ్యాన్స్ ఉంటారా అనే రేంజ్ లో ఆయన నటించి ఎక్కువ మంది ప్రేక్షకుల మన్ననలను పొందాడు. సాయి కుమార్ కూడా అప్పటి వరకు డబ్బింగ్ తోనే గుర్తింపు పొందగా ఈ సినిమా ద్వారా తెలుగు లో కూడా హీరోగా నిలదొక్కుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: