ఏ పాటకు అయినా మాస్ బీట్ అన్నది తాత్కాలిక  ఆనందమే. మెలోడీ పాటలకే ఎపుడు చిర కీర్తి ఉంటుంది. అలాంటి పాటలే చరిత్రలో నిలిచిపోతాయి. పదే పదే పాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో మెలోడీస్ ఎక్కువగా చేసిన సంగీత దర్శకులు ఉన్నారు.

అలాగే మాస్ ని ఆకట్టుకునే సంగీతాన్ని అందించిన వారిలో ప్రధముడిగా చక్రవర్తిని చెప్పుకోవాలి. ఆయన తన సాంగ్స్ తో నాటి యూత్ ని ఉర్రూతలూగించారు. అదే విధంగా నాటి స్టార్లకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. దాదాపుగా వేయి సినిమాల దాకా సంగీతం అందించిన చక్రవర్తి మొదట మెలోడీ కే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన తొలి సినిమా శోభన్ బాబు హీరోగా వచ్చిన మూగ ప్రేమ.

ఆ మూవీలో సాంగ్స్ అన్నీ వీనుల విందుగా ఉంటాయి. ఆ తరువాత శోభన్ తో చేసిన శారద మూవీ మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరుగా ఉంటుంది. ఇదా లోకం, తల్లీ కూతుళ్ళు వంటి సినిమాలో చక్రవర్తి అందించిన పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల నోట పలుకుతాయి. ఇక చీకటి వెలుగులు, బలిపీఠం, మల్లెపూవు మూవీలలో టోటల్ సాంగ్స్ సూపర్ హిట్.

అటువంటి చక్రవర్తి మాస్ బీట్ వైపుగా ఎందుకు మళ్ళారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో ఎన్టీయార్   క్రిష్ణ వంటి మాస్ హీరోలకు మ్యూజిక్ చేయడానికి చక్రవర్తి ఈ బాట ఎన్నుకున్నాడని చెప్పాలి. యమగోల మూవీతో ఎన్టీయార్ కి సూపర్ మాస్ బీట్లు సమకూర్చిన చక్రవర్తి ఆ తరువాత వెనక్కి చూడలేదు. ఆ వరసలో ఆయన వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, నాదేశం వంటి సినిమాల్లో మాస్ హిట్లే ఇచ్చారు. అయితే ఈ మొత్తం సినిమాలో ఒకటి రెండు పాటలను మాత్రం మెలోడీ టచ్ తో చేసి తన కోరికను చక్రవర్తి  అలా తీర్చుకునేవారు. నాడు పోటీ పెరగడం, బయట వాతావరణంలో కూడా మార్పు రావడంతోనే చక్రవర్తి అలా తన పంధాను మార్చుకున్నారు. అదే విధంగా టాలీవుడ్ లో  ఏడాదికి అరవై నుంచి డెబ్బై దాకా సినిమాలకు పనిచేసిన బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చక్రవర్తి చరిత్ర సృష్టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: